
రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకుడు. ‘వరల్డ్ ఆఫ్ థామా’ పేరుతో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో తడకా అనే పాత్రలో రష్మిక, అలోక్‌గా ఆయుష్మాన్, యక్షసాన్‌గా నవాజుద్దీన్, రామ్ బజాజ్ గోయెల్‌గా పరేశ్ రావల్ కనిపించారు.
కామెడీ, యాక్షన్, రొమాన్స్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.టీజర్ విజువల్స్‌ను బట్టి అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. ఓ వైపు గ్లామరస్ లుక్‌లో లిప్‌లాక్ సీన్స్‌లోనూ కనిపించిన రష్మిక.. మరోవైపు యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది. తను ఇందులో తోడేలు తరహా పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
ALSO READ : ఫస్ట్ టైం ఓటీటీ సంస్థ నిర్మించిన మూవీ..
విలన్‌గా డిఫరెంట్ గెటప్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీ కనిపించాడు. మలైకా అరోరా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ బ్లడీ లవ్‌స్టోరీని దీపావళికి విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న హారర్ కామెడీ యూనివర్సల్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. 2018లో ‘స్త్రీ’తో మొదలైన ఈ ఫ్రాంచైజీలో 2022లో భేడియా, 2024లో ముంజ్య, స్త్రీ 2 చిత్రాలు వచ్చాయి.
స్త్రీ 2 vs థామా:
మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో వచ్చిన శ్రద్ధా కపూర్ ‘స్త్రీ2’ప్రపంచవ్యాప్తంగా రూ.884.45 కోట్ల వసూళ్లను సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏడవ అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.
ఇండియాలో రూ.562.24 కోట్ల నెట్ వసూళ్లను వసూలు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో రూ.144 కోట్లు సంపాదించింది. మరి ఇప్పుడు మాడాక్ హారర్-కామెడీ యూనివర్స్లో నాల్గవ భాగంగా వస్తోన్న థామపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకంటే ముందు రశ్మికపై భీభత్సమైన అంచనాలు ఉన్నాయి.
హిందీ బాక్సాఫీస్ క్వీన్ రష్మిక మందన్న:
రష్మిక 2023 చివర్లో యానిమల్, 2024లో పుష్ప 2, ఈ 2025లో ఛావా. ఈ మూడు సినిమాల్లో భిన్నమైన పాత్రలు పోషించి మెప్పించింది. అంతేకాకుండా ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో గత 16 నెలల్లో ఆమె నటించిన మూడు సినిమాలు కలిపి ఏకంగా రూ.3300 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇదే కాకుండా.. రష్మిక నటించిన యానిమల్ హిందీలో రూ.503 కోట్లు, పుష్ప 2 హిందీలో రూ.812 కోట్లు, ఛావా హిందీలో రూ.532 కోట్లు వసూలు చేశాయి.
ఈ మూడు సినిమాలు మొత్తంగా కలిపి కేవలం హిందీలోనే రూ.1850 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ క్రమంలో రష్మిక నటిస్తున్న లేటెస్ట్ థామపై భారీ అంచనాలే నెలకొన్నాయి. థామ ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందో అనే ఆసక్తి నెలకొంది.