భయపడకండి..ఇది మాస్క్..

భయపడకండి..ఇది మాస్క్..

కరోనా..ఈ పేరు చెబితేనే గుండె గుభేల్ మంటోంది. 2020లో దేశంలోకి ప్రవేశించిన కరోనా ఎంతో మందిని పొట్టనపెట్టుకుంది. సెకండ్ వేవ్లో ఎంతో మందిని బలితీసుకుంది. ఆ తర్వాత వివిధ వేరియంట్ల రూపంలో విజృంభిస్తూ.. జనాలకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తూనే ఉంది. కొవిడ్ను కంట్రోల్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మనదేశంలోనూ అనేక కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయినా..కరోనా మాత్రం కంట్రోల్ అవడం లేదు. దీంతో కరోనాను కట్టడి  చేయాలంటే నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్ర రాష్ట్రాల ఆరోగ్య శాఖలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఖచ్ఛితంగా మాస్కులు ధరించాలని ఎప్పటికప్పుడు ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నాయి. 

థార్డ్ వేవ్ ముగిసిన తర్వాత కరోనాపై ప్రజల్లో కొంత భయాందోళన పోయిందని చెప్పాలి.  అయితే జులై తర్వాత కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందని గతంలోనే WHO ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. భారత్ తో సహా అన్ని దేశాల్లో రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మళ్లీ మాస్కు ధరించాలని ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కొత్త వేరియంట్ల కారణంగా కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించింది. అటు న్యూజిలాండ్ సైతం మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని తమ దేశ పౌరులకు ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. 12 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్న వారికి  మాస్కులు ధరింపజేయాలని ...తల్లిదండ్రులకు సూచించింది. అంతకంటే తక్కువ వయస్సున్న చిన్నారులకు వారికి తగ్గ మాస్కులు వేయాలని తెలిపింది. 

న్యూజిలాండ్ ప్రభుత్వ ఆదేశాలతో విమాన ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్కు  వెళ్తున్న ఓ ఫ్లైట్లో   తన చిన్నారికి  తల్లి వేసిన మాస్కు..ఫన్ ను క్రియేట్ చేస్తోంది. మాస్కుతో  పిల్లాడి ముఖాన్ని అంతా కవర్ చేసిన మహిళ.....కళ్ల వద్ద మాత్రం రెండు చిన్న రంధ్రాలు చేసింది.  వాటి ద్వారా పిల్లాడు అటు ఇటు చూస్తున్నాడు.  ఫన్నీ మాస్కును ధరించిన పిల్లాడిని చూసి..ఫ్లైట్లోని జనం కాసేపు నవ్వుకున్నారు. ఓ వ్యక్తి మాస్క్ ధరించిన చిన్నారిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయింది. కొందరైతే హారర్ మూవీ తీసేందుకు చిన్నారి రెడీ అవుతున్నాడా అని కామెంట్స్ చేశారు. మరికొందరైతే ఫుల్ఫేస్ను కవర్ చేస్తూ..చిన్నారులకు మాస్క్ వేయకూడదని ..అది ప్రమాదమని కామెంట్ చేశారు.