మిడ్జిల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

మిడ్జిల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్  నేతల మధ్య ఘర్షణ

మిడ్జిల్, వెలుగు: మండల కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీ నాయకుల మధ్య బుధవారం ఉదయం ఘర్షణ జరిగింది. విరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో కొందరు యువకులు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులం, జేఏసీ నాయకులం, నిరుద్యోగులమంటూ వచ్చి బీఆర్ఎస్  ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఉద్యోగ నోటిఫికేషన్లు అసంపూర్తిగానే ఆపేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు తప్ప మరే పార్టీకైనా ఓట్లు వేయాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. 

ఇది గమనించిన బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకొని, వారి దగ్గర ఉన్న కరపత్రాలను లాక్కొని కాల్చివేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్  పార్టీ నాయకులు ఘటనా స్థలానికి రావడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరు పార్టీల నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఘర్షణ సద్దుమణిగింది.