రోడ్డుపై నాగుపాము..భారీగా ట్రాఫిక్ జామ్

రోడ్డుపై నాగుపాము..భారీగా ట్రాఫిక్ జామ్

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దోర్నాల మార్కాపురం రహదారిపై  నాగుపాము క‌ల‌కలం సృష్టించింది. రోడ్డు మధ్యలో నాగుపాము పడగవిప్పి చుట్టూ చూస్తూ కనిపించ‌డంతో వాహ‌నదారులు భ‌యంతో ఆగిపోయారు. దాంతో కాసేపు వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్పడింది. రోడ్డుపై నాగుపాము ప్రత్యక్షమవడంతో వాహనాల నుంచి ప్రయాణికులు బయటకువచ్చి మరీచూశారు. కొన్ని వాహనాలు మాత్రం పాము పక్క నుంచి వెళ్లిపోయాయి. 

రోడ్డుపై వాహనాలు వెళ్తుంటే వాటిని పాము వెంబడించింది. దీంతో వాహనాలన్నింటిని నిలిపివేశారు. దాదాపు అరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొద్దిసేపటి తర్వాత పాము వెళ్లిపోవడంతో...ట్రాఫిక్ క్లియర్ అయింది. ప్రస్తుతం నాగుపాముకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.