ఓయూలో ‘భవిష్యత్తులో భూమి సవాళ్లు’ అనే అంశంపై సమావేశం

ఓయూలో ‘భవిష్యత్తులో భూమి సవాళ్లు’ అనే అంశంపై సమావేశం

హైదరాబాద్ : ‘భవిష్యత్తులో భూమి సవాళ్లు, సామాజిక, ఆర్థిక, పర్యావరణ స్థిరత్వం సవాళ్లు’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్శిటీలో సమావేశం నిర్వహించారు. ఓయూ డిపార్ట్ మెంట్ ఆఫ్  జియోగ్రఫీ జియో ఇన్ఫర్మేటిక్ వారి ఆధ్వర్యంలో.. ఓయూ దూరవిద్యా కేంద్రం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఇంటర్నేషనల్ సమావేశంలో వివిధ దేశాల నుండి వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


స్పెస్ లోకి పంపిన సాటిలైట్స్ రైతులకు, సముద్రంలోని మత్స్యకారులకు ఏ విధంగా జియో ఇన్ఫర్మేషన్ ఇస్తుందో..? విద్యార్థులకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం ప్రొఫెసర్ వైవీఎన్ కృష్ణమూర్తి వివరించారు.