పిల్లులతో ప్రపంచయాత్ర చేస్తున్న ఓ జంట

పిల్లులతో ప్రపంచయాత్ర చేస్తున్న ఓ జంట

మన దేశంలో ఒక పని మీద బయటికి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే శకునం బాగోలేదని, ఆ రోజుకి ఆ పనినే వాయిదా వేసుకుంటారు కొందరు. కానీ, ఈ జంట మాత్రం పిల్లుల్ని చంకనేసుకుని ప్రపంచయాత్ర చేస్తోంది. న్యూయార్క్​లో డాన్​ అనే ఒక లాయర్​, తన భార్య ప్రపంచయాత్ర చేయాలనుకున్నారు. వాళ్లతో పాటు పెంపుడు పిల్లులైన స్పాంజ్​ కేక్, మోచా, డేవిడ్​ని వెంట తీసుకెళ్లారు. ఇప్పటికే అమెరికా, యూరప్​లో పది ప్రదేశాలు చుట్టేశారు. పిల్లులతో దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్​ చేసుకున్నారు. ఇంకేముంది పిల్లుల క్యూట్​నెస్​​కి నెటిజన్స్ ఫిదా. సరదాగానే ఉంది కానీ, వాటిని తీసుకెళ్లడం ఇబ్బంది అనిపించలేదా? అని వాళ్ళనడిగితే.. ‘పోయిన డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ముప్పై ఏండ్ల వయసులో మా పిల్లులతో కలిసి వరల్డ్ టూర్ వేసే ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదు కదా!’ అన్నారు ఆ దంపతులు.