విశ్వాసం అంటే నీదే: కరోనాతో చనిపోయిన యజమాని..3నెలలుగా కన్నీళ్లతో ఎదురు చూస్తున్న కుక్క

విశ్వాసం అంటే నీదే: కరోనాతో చనిపోయిన యజమాని..3నెలలుగా కన్నీళ్లతో ఎదురు చూస్తున్న కుక్క

తరాలు మారేకొద్దీ మనిషి బుద్ధి మారుతుందని నేటి మానువుడు నిరూపిస్తే.. ఎన్ని జన్మలెత్తినా మరెన్ని తరాలు గడచినా కుక్కకున్న విశ్వాసం మరే జీవిలో ఉండదని ఓ శునకం నిరూపించింది.

చైనా వుహాన్ కు చెంగిన ఓ వ్యక్తి గ్జియావో బేవో అనే ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాడు. ఓ సమయంలో  యజమానికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ట్రీట్ మెంట్ తీసుకునేందుకు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లాడు. వెళ్లే సమయంలో గ్జియావోను కూడా వెంటతీసుకెళ్లాడు. అయితే ట్రీట్ మెంట్ కోసం వెళ్లిన  బాధితుడికి డాక్టర్లు పలు  టెస్ట్ లు చేయగా పెనుమోనియా వ్యాధి సోకినట్లు గుర్తించారు. వైద్యుల సలహాతో ట్రీట్ మెంట్ తీసుకునేందుకు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. ఐదురోజుల తరువాత బాధితుడు కరోనా తో మరణించారు. కానీ ఆ విషయం తెలియని గ్జియావో మాత్రం యజమాని కోసం కళ్లు కాయలు కాచేలా నిద్రహారాలు మాని ఎదురు చూసింది. అలా ఒకరోజు కాదు రెండు రోజులుకాదు సుమారు 3నెలలకు పైగానే. ఆశ్చర్యంగా ఉంది కదూ. కుక్క కదా విశ్వాసం ఎక్కువ.

యజమాని చనిపోయాడని తెలియక, తన కోసం వస్తాడని కన్నీళ్లతో ఎదురు చూస్తోంది. కుక్క బాధ చూడలేదని ఆస్పత్రి సిబ్బంది సైతం ఓ ప్రాంతంలో విడిచి పెట్టారు. మళ్లీ తన యజమానిని వెతుక్కుంటూ వచ్చింది.

ఎంతలా అంటే తన యజమాని ఎక్కడికి తీసుకెళ్లాడో.. అలా తీసుకెళ్లిన ప్రతీ ప్రాంతానికి వెళ్లి ఎదురు చూడసాగింది. దాని బాధ చూడలేదని షాపుల యజమానులు, ఆస్పత్రి సిబ్బంది పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుక్క అలాగే తన యజమానికి కోసం ఎదురు చూస్తుందని స్థానికంగా ఉన్న కిరాణా స్టోర్ యజమాని మీడియా సంస్థ సన్ యూకేకి తెలిపారు.