మా అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలి:కోడలి ప్రకటన

V6 Velugu Posted on Jul 20, 2021

మా అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలంటూ ఓ కోడలు ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా అమెరికా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రకటన అన్ని దేశాల వారిని ఆకర్షిస్తోంది. ఒంటరి అయిన తన అత్త కోసం కోడలు చేస్తున్న ప్రయత్నంపై నెటిజన్లు ట్రోల్ చేస్తూ రకరకాలుగా స్పందిస్తున్నారు. న్యూయార్క్ కు చెందిన కోడలు తన అత్తకు 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి అద్దెకు కావాలంటూ క్రెయిగ్ లిస్ట్ అనే క్లాసిఫైడ్  వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చింది. తాము ఉమ్మడిగా వెళ్తున్న పెళ్లి కోసం అత్త వెంట రెండు రోజులపాటు తోడుగా ఉండేందుకు అద్దెకు బాయ్ ఫ్రెండ్ కావాలని కోరింది. తన అత్తతోపాటు రెండు రోజులు తోడుగా గడిపితే 960 డాలర్లు (మన డబ్బుల్లో రూ.72వేలు) ఇస్తామని ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు దరఖాస్తు చేసుకునే వారికి కొన్ని షరతులు విధించింది. బాయ్ ఫ్రెండ్ గా వచ్చే వారికి బాగా డ్యాన్స్ చేయడంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని కోడలు స్పష్టం చేసింది. ఈ కోడలి ప్రకటన.. కండీషన్లపై నెటిజన్లు చమత్కారంగా స్పందిస్తూ ట్రోల్ చేస్తుండడం ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా మన దేశంలోని వారు రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఎమోజీలు జత చేస్తున్నారు. 

Tagged , New York today, daughter-in-law effort, classified advertisement, ‘hire a boyfriend, boy friend wanted for mother-in-law

Latest Videos

Subscribe Now

More News