
మీరు మీ మొబైల్ ఫోన్ ను ఎక్కడ పెట్టారో గుర్తుకు రావడం లేదా.. లేదా మీ మొబైల్ ను పోగొట్టుకున్నారా. మరేం చింతించకండి. మీ ఫోన్ ఎక్కడుందో వెంటనే కనిపెట్టేయొచ్చు. అందుకు మే 17న కేంద్రం తొలి సారిగా ఓ ప్రత్యేకమైన పోర్టల్ ను తీసుకురానుంది.
www.sancharsaathi.gov.in.. ప్రపంచ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం రోజు మే 17న ఈ పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఈ పోర్టల్‌ను టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ఆవిష్కరించనున్నారు. దీన్ని అన్ని టెలికాం సర్కిల్ లకు కనెక్ట్ చేయడంతో.. మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రాక్ చేసి కనిపెడుతుంది. ప్రస్తుతం ఈ పోర్టల్ ముంబై, ఢిల్లీ ప్రాంతాల వారికి మాత్రమే అందుబాటులోకి రానుంది,
IANS తన నివేదికలో, ఈ సేవను ఉపయోగించి ఇప్పటివరకు 4 లక్షల 70వేల పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లు బ్లాక్ చేయబడ్డాయి. అదనంగా, ఈ ప్లాట్‌ఫారమ్ 2 లక్షల 40 వేల కంటే ఎక్కువ మొబైల్ ఫోన్‌ల ట్రాకింగ్‌ను ప్రారంభించింది. ఈ లింక్ ద్వారా, దాదాపు 8వేల ఫోన్‌లు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ పోర్టల్ సహాయంతో, వినియోగదారులు వారి SIM కార్డ్ నంబర్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు. యజమాని ID ద్వారా ఎవరైనా SIMని ఉపయోగిస్తున్నట్లు తెలిస్తే దాన్ని బ్లాక్ కూడా చేయవచ్చు.