డిఫెన్స్​ ఆఫీసర్ ​భూమిపై ఎంపీపీ భర్త కన్ను

డిఫెన్స్​ ఆఫీసర్ ​భూమిపై ఎంపీపీ భర్త కన్ను
  • డిఫెన్స్​ ఆఫీసర్ ​భూమిపై ఎంపీపీ భర్త కన్ను
  • తప్పుడు పత్రాలతో గుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితుడి ఆరోపణ

నర్సింహులపేట, వెలుగు : అధికార పార్టీకి చెందిన  ఓ లీడర్ తన భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడని తప్పుడు పత్రాలు చూపించి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని  మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం వంతడపల గ్రామానికి చెందిన  డిఫెన్స్ ఆఫీసర్  ఫూల్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.   ఆదివారం ఆయన మాట్లాడుతూ..  ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో తాను ఉంటున్నానని, గ్రామ శివారులోని కస్తూర్బా గాంధీ స్కూల్ పక్కన 2005లో 5ఎకరాల  వ్యవసాయ భూమి కొన్నట్లు చెప్పారు.

ALSO READ :చంద్రబాబుకు నిజమైన వారసుడు రేవంత్ 

మండలానికి చెందిన ఎంపీపీ భర్త  టేకుల యాదగిరిరెడ్డికి చెందిన 4.30ఎకరాల్లో  కొంత స్కూల్ కు విరాళం ఇచ్చి మిగతా ల్యాండ్ అమ్ముకున్నాడన్నారు. దీంతో పక్కనే ఉన్న తన భూమిపై కన్నేశాడని, తప్పుడు పత్రాలు సృష్టించి తనపై దౌర్జన్యానికి దిగాడని ఆరోపించారు. తాను సాగు చేసుకుంటున్న భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాడన్నారు. 20ఏండ్ల నుంచి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నామని తన లాంటివారిపై అధికార పార్టీ లీడర్లు ఇలాంటి దౌర్జన్యానికి దిగడం సరికాదని,  ఏదైనా ఉంటే చట్టప్రకారం చూసుకోవాలని అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని వేడుకున్నారు.