Worlds Richest Dog: ఈ కుక్క వందల కోట్లకు అధిపతి

Worlds Richest Dog: ఈ కుక్క వందల కోట్లకు అధిపతి

ఒక మనిషి ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయ్యాడన్న మాటలు ఎక్కువగా సినిమాల్లో, అప్పుడప్పుడు నిజ జీవితంలో చూస్తుంటారు. కానీ, జంతువులు ఓవర్ నైట్ లో కోటీశ్వలు అయ్యాయని ఎప్పుడూ విని ఉండరు. ఆ మాటలు నిజం చేస్తూ ఇటలీకి చెందిన గున్థర్ (జర్మన్ షెపర్డ్ కుక్క) ఓవర్ నైట్ లో కోటీశ్వరురాలయింది. ఒకటి రెండు కాదు ఏకంగా రూ.655 కోట్లకు యజమాని అయింది. 

ఈ కుక్కను జర్మన్ కౌంటెస్ కార్లోటా లైబెన్స్టెయిన్ అనే ధనవంతుడు పెంచుకునేవాడు. తన కొడుకు గున్థర్ ఆత్మహత్య చేసుకొని చనిపోగా ఈ కుక్కకు ఆ పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. వారసులు లేని లైబెన్స్టెయిన్ కు తన పెంపుడు కుక్క గున్థర్ చివరి వరకు తోడుగా ఉంది.  లైబెన్స్టెయిన్ చనిపోయేముందు ఒక ట్రస్టు ఏర్పాటుచేసి తన ఆస్థినంతా పెంపుడు కుక్కకు రాసిచ్చాడు. ఇలా ఆ కుక్క ఈ ఆస్తిని వారసత్వంగా పొందింది. కార్లు, బంగ్లాల్లో గున్థర్ ఉంటుంది. దీన్ని చూసుకోవడానికి కొంతమంది పనిమనుషులు కూడా ఉన్నారు. ఈ కుక్క జీవితాన్ని, లైఫ్ స్టైల్ ని దర్శకుడు ఆరేలియన్ లెటర్జీ డాక్యుమెంటరీగా తీసి గున్థర్స్ మిలియన్స్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశాడు.