
నర్సాపూర్ (జి), వెలుగు : అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గొల్లమాడ గ్రామానికి చెందిన కుమ్మరి సుభాశ్ (50) తనకున్న వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
పంట పెట్టుబడితో పాటు కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. అప్పులు పెరిగిపోవడం, అవి తీర్చే మార్గం లేకపోవడంతో మనస్తాపానికి గురైన సుభాశ్ మంగళవారం స్థానిక వాగు పక్కన చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్సై గణేశ్ తెలిపారు.