బీసీ నేతల నిరాశ.. ఎడాదిగా పార్టీలో మూడు ముక్కలాట

బీసీ నేతల నిరాశ.. ఎడాదిగా పార్టీలో మూడు ముక్కలాట

నిజామాబాద్, వెలుగు:  పార్టీ పదవుల కోసం నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​  అగ్రనేతల మధ్య  పోరు నడుస్తోంది.  పీసీసీలో బీసీ  నేతలకు  పదవులు రాకపోవడంతో   అసంతృప్తి పెరుగుతోంది.  అగ్రనేతలు  మహేశ్ గౌడ్, మధుయాష్కీ, సుదర్శన్​ రెడ్డి  , తమ అనుచరులకు పదవులు ఇప్పించుకనేందుకు పోటీ పడ్డారు. కానీ,  సుదర్శన్​ రెడ్డి వర్గీయులకే పెద్దపీట దక్కింది.  జిల్లా ప్రెసిడెంట్ ,  పీసీసీ వైస్​ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ  పోస్ట్​ లు మాజీ మంత్రి వర్గీయులకే దక్కడంతో  మిగిలిని ఇద్దరు నేతలు అసంతృప్తికి గురయ్యారు.  పార్టీలు మార్చిన  నేతలకే ప్రాధాన్యం ఇచ్చారని స్థానిక నేతలు అనుకుంటున్నారు.   బీసీలకు ప్రాధాన్యం  ఇవ్వలేదని  ఆ వర్గం నేతలు నిరాలో  ఉన్నారు. 

సీనియర్లకు  నిరాశ

బీసీ సెల్​ జిల్లా మాజీ  ప్రెసిడెంట్​   శేఖర్ గౌడ్​   డీసీసీ ప్రెసిడెంట్​ పోస్ట్​ ను ఆశించారు. జిల్లా ఇన్​ఛార్జ్​ ప్రెసిడెంట్ కేశవేణు,  అర్బన్​ నేతలు  పీసీసీలో  పదవులు ఆశించారు. 35 సంవత్సరాలుగా    శేఖర్​ గౌడ్, కేశ వేణు  పార్టీలో  పనిచేస్తున్నారు. వేణు ఎన్​ఎస్​యూఐ లో విద్యార్థి స్థాయి   పని చేస్తూ యూత్ కాంగ్రెస్ అర్బన్​ ప్రెసిడెంట్​గా 10 ఏండ్లు,  పార్టీ అర్బన్​ ప్రెసిడెంట్​ గా 12 ఏళ్లు  పనిచేశారు. కొన్ని నెలలు  జిల్లా ఇన్​ ఛార్జ్​  ప్రెసిడెంట్​ గా పనిచేస్తున్నారు.  బీసీనేతలైన  కేశవేణుకు,  శేఖర్​ గౌడ్​ లో ఒకరికి   డీసీసీ ప్రెసిడెంట్​ పదవి దక్కుతుందని ఆశించారు. కానీ   రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోహన్​ కు  పదవి  రావడంతో వీళ్లు నిరాశకు గురయ్యారు.    బీసీ నేత,  మాజీ విప్​ ఈరవత్రి అనీల్​ ను   జిల్లా ప్రెసిడెంట్ ను చేయాలని  ప్రపోజల్  ఉండగా..   ఆయన  తిరస్కరించారు. దీంతో  సిట్టింగ్​ ప్రెసిడెంటే పదవిలో కొనసాగించాలని నిర్ణయించారు.  రూరల్​ అసెంబ్లీలో కీలకనేతగా శేఖర్​ గౌడ్​ కు పదవి రాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్​ మహేశ్​  వర్గం అడ్డుపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో  ముగ్గురు నేతల మధ్య అంతర్గత పోరు  మొదలైంది.   కానీ పార్టీ పదవుల్లో బీసీలకు చోటు లేకుండా   సుదర్శన్​ రెడ్డి అడ్డుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.  మరోవైపు  పీసీసీలో  జిల్లా మాజీ ప్రెసిడెంట్​ తాహెర్​ బిన్​ హందాన్​ కు వైస్​ ప్రెసిడెంట్​పదవి  దక్కింది. సీనియర్​ నేతలు గంగాధర్, నగేశ్​ రెడ్డి  కి జనరల్ సెక్రటరీ పదవులు  వచ్చాయి.  ఒకే వర్గానికి చెందిన వీరికి పదవులు రావడంతో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 ఎడాదిగా లొల్లి..

ఎడాది క్రితం  పీసీసీ  ప్రచారకమిటీ చైర్మన్​ గా మధుయాష్కి, వర్కింగ్ ప్రెసిడెంట్​గా మహేశ్​ గౌడ్​ నియమితులయ్యారు.  అనంతరం జిల్లా పర్యటనలో స్వాగత సభకు , బోధన్​ లో జరిగిన కాంగ్రెస్​ సభకు మాజీ మంత్రి  సుదర్శన్​ రెడ్డి  రాకపోవడంతో  విబేధాలు ఏర్పడ్డాయి. బోధన్​ ముఖ్య నేతలతో హైదరాబాద్​ లో కాంగ్రెస్​ మీటింగ్​ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్​ కు  మధుయాష్కీ, మహేశ్​ గౌడ్​  గైర్హాజరయ్యారు. అక్కడ  రేవంత్​ రెడ్డి జోక్యంతో విబేధాలకు తెరపడినట్టేనని  అనుకున్నారు. కానీ,  నిజామాబాద్​లో కాంగ్రెస్ సభ్యత్వ జిల్లా రివ్యూ మీటింగ్ మధుయాష్కీపై  క్రమ శిక్షణ చర్యలకు మాజీ ఎమ్మెల్యే అనిల్ తీర్మానం పెట్టారు. మళ్ళీ ఎస్టీసెల్ జిల్లా ప్రెసిడెంట్​పదవి నియామకంతో నేతల మధ్య  మరో విబేధాలు వచ్చాయి.  పీసీసీ పదవుల కోసం మళ్లీ ముగ్గురి  నేతల మధ్య లొల్లి మొదలైంది. 

పార్టీ  అభివృద్ధికి కృషి చేస్తా..  

నాకు పోస్ట్​ వచ్చినా, రాకపోయినా పార్టీ  అభివృద్ధికి కృషి చేస్తాను. బీసీ నేతలకు తగిన ప్రయార్టీ ఇవ్వాల్సింది. 35 ఏండ్ల నుంచి జిల్లాలో పార్టీ బలోపేతానికి కష్టపడ్డాను. పదవులకు కాదు ప్రజాసమస్యలపై పోరాడతాను. నేతల ఆధిపత్యపోరు వల్ల పోస్ట్ రాలేదనదీ అసత్యం .  కష్టపడ్డవారికి పార్టీలో  న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. 
- కేశ వేణు