రైల్వే స్టేషన్లు, ఆ పరిసరాల్లో మాస్కు లేకపోతే రూ.500 జరిమానా

రైల్వే స్టేషన్లు, ఆ పరిసరాల్లో మాస్కు లేకపోతే రూ.500 జరిమానా

న్యూఢిల్లీ: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో దశ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతుండడంతో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. రైళ్లు, రైల్వే స్టేషన్లు, ప్రాంణాల్లోనే కాదు.. రైల్వే పరిసరాల్లోనూ శుభ్రత, సామాజిక దూరం తప్పనిసరి పాటించాలని నిర్దేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో,  ప్రాంగణాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ.. మాస్కులు ధరించని వారికి ₹500 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఉమ్మేసినా జరిమానా రూ.500 విధించేలా ఆదేశాలిచ్చింది. రైల్వే పరిసరాలను అపరిశుభ్రం చేసే చర్యలకు జరిమానా విధించే చట్టంలో ఈ మేరకు కొత్త నిబంధనలు చేర్చారు. ఈ చట్టం ప్రకారం రైల్వే పరిసర ప్రాంతాల్లో, రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ఉమ్మి వేసినా లేక మాస్కు ధరించకపోయినా 500 రూపాయలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా నిబంధనలు కఠినతరం చేసింది రైల్వే శాఖ.