IND vs ENG: కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ.. చితక్కొడుతున్న ఇంగ్లాండ్ టెయిలెండర్

IND vs ENG: కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ.. చితక్కొడుతున్న ఇంగ్లాండ్ టెయిలెండర్

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినా.. రూట్ సెంచరీతో ఇంగ్లాండ్ కోలుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్  టెయిలెండర్ ఓలీ రాబిన్సన్ సైతం భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ పేస్ బౌలర్.. హాఫ్ సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 81 బంతుల్లో తన కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.     

హర్టిలీ ఔట్ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన రాబిన్సన్.. భారత జట్టుకు కొరకరాని కొయ్యలా మారాడు. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ లా బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్ చేసేలా కనిపిస్తున్నాడు. మరో ఎండ్ లో రూట్ క్రీజ్ లో అట్టి పెట్టుకొని ఉండటంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం 99 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. తొలి రోజు ఆటలో భాగంగా సెంచరీ పూర్తి చేసుకున్న రూట్(113) రాబిన్సన్(58) క్రీజ్ లో ఉన్నారు. ఈ ఇద్దరు 8వ వికెట్ కు అజేయంగా 96 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి రోజు ఆటలో భాగంగా తొలి సెషన్ లోనే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత రెండు సెషన్ లలో భారత బౌలర్లు రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ రెండు.. అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.