ప్రయాణమే చేయని ఫ్లైట్​కు టికెట్లమ్మితే.. అరగంటలో ‌‌ఫుల్

V6 Velugu Posted on Oct 14, 2020

‌‌‌‌‌‌సింగపూర్: కరోనా వల్ల సర్వీసులన్నీ రద్దైనయ్.. ఒకటీ అరా ఫ్లైట్లు నడుస్తున్నా వచ్చే డబ్బు ఆడికాడికే అయిపోతంది. లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో ఎయిర్​లైన్స్​ కంపెనీలన్నీ దాదాపుగా కుదేలయ్యాయి. ఇలాంటి టైమ్​లో సింగపూర్​ ఎయిర్​లైన్స్ సోమవారం టికెట్ల అమ్మకం షురూ జేసింది. ఇట్లా కౌంటర్​ తెరిచిందో లేదో.. అరగంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయినయ్. స్పెషల్​ సూట్​లో భోజనానికి ఒక్కరికి రూ.35 వేలు, బిజినెస్​ క్లాస్​లో ఒక్కరికి రూ.17 వేల నుంచి 5 వేల దాకా, ప్రీమియం ఎకానమీ క్లాసులో భోజనానికి రూ.3 వేలుగా నిర్ణయించి టికెట్లు అమ్మారు. లాక్​డౌన్​తో చిక్కుకుపోయిన వాళ్లు టికెట్ల కోసం ఎగబడడం మామూలే కదా అనుకుంటున్నారా.. కానీ ఈ ఫ్లైట్​ఏ దేశానికీ వెళ్లట్లేదు. ఆ మాటకొస్తే పార్కింగ్​ నుంచి ఇంచ్​ కూడా కదలదు. అయినా కంపెనీ టికెట్లు అమ్మింది, జనం ఎగబడి మరీ కొనుక్కున్నరు. మరీ టికెట్​ దేనికి అంటే.. విమానంలో భోజనం చేయడానికట. పార్కింగ్​లో ఉన్న ఏ380 జంబో జెట్ ను సింగపూర్​ ఎయిర్​లైన్స్ టెంపరరీ హోటల్​గా మార్చింది. టికెట్​కొనుక్కుని వచ్చినోళ్లను ఎయిర్​హోస్టెస్​లు విమానంలోకి తీసుకెళ్లి, సీట్లో కూర్చోబెట్టి మెనూ ప్రకారం భోజనం పెడ్తరు. విమానం కదలన్నట్టేగానీ మిగతా మర్యాదలన్నీ అచ్చంగా ప్రయాణికులను చూసుకున్నట్లే చూసుకుంటరట. ఈ టికెట్​ కొనుక్కుంటే ఎంచక్కా విమానంలో ప్రయాణం చేసిన ఫీలింగ్​ వస్తదని జనాలు కూడా బుక్​ చేసుకున్నరు. ఫ్లైట్లను పార్కింగ్​లో పెడితే పార్కింగ్​ ఫీజు కింద రోజుకింత అని చెల్లించాలి. అందుకే సింగపూర్​ ఎయిర్​లైన్స్​ ఈ ఆలోచన చేసింది.

Tagged lock down, corona, airlines, sold, covid, Tickets, travel, Effect, new, out, All, in, the, not, that, an, full, a, flight, does, Half, hour, IDEA, Singapore

Latest Videos

Subscribe Now

More News