
రయ్యిమంటూ పరుగులు తీసే కారు గాలిలో ఎగిరితే ఇదిగో ఈ ఫొటోలో చూపినట్లుంటది. అవును.. ఇది ఎగిరే కారే. స్లొవేకియాలో ట్రయల్‌రన్ చేస్తుంటే తీసిన ఫొటోలివి. నిత్రా ఎయిర్ పోర్ట్‌నుంచి టేకాఫ్ అయిన ఈ ఎగిరే కారు దాదాపు 8 వేల అడుగుల ఎత్తుదాకా పైకెగిరింది. గాలిలో గంటకు 170 కి.మి. వేగంతో ప్రయాణించి 35 నిమిషాల తర్వాత బ్రాతిస్లావా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది.