మానసికస్థితి సరిగ్గా లేక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

మానసికస్థితి సరిగ్గా లేక  ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

మానసికస్థితి సరిగ్గా లేకపోవడంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది.  బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35) జనగామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.  సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్ తో 2015 లో వీణ వివాహం జరిగింది.  అయితే గతకొంతకాలంగా భార్యాభర్తలు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో వీణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.  మృతురాలు తండ్రి రామచంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  బీబీపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.