ఉగాండాలో బతికి బయటపడ్డ చిన్నారి

 ఉగాండాలో బతికి బయటపడ్డ చిన్నారి

న్యూఢిల్లీ: హిప్పో పొటామస్​ ఓ రెండేండ్ల బాలుడిని అమాంతం మింగేసింది. అది చూసి ఇంటోళ్లు అరుస్తూ, రాళ్లు విసరడం తో బాబును ఉమ్మేసింది. ఉగాండాలో జరిగిన ఈ సంఘటనలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కట్వే కబటోరో టౌన్​కు చెందిన రెండేండ్ల ఇగా పౌల్, డిసెంబర్ 4న చెరువు పక్కన ఆడుకుంటు న్నాడు. అప్పుడే ఒక హిప్పో పొటామస్​ వచ్చి.. పౌల్​ను మింగేసింది. తల, రెండు చేతులు హిప్పో నోట్లోకి వెళ్లిపోయాయి. సగం శరీరం బయట కనిపిస్తున్నది. ఇది చూసిన ఇంటోళ్లు గట్టిగా కేకలు వేస్తూ హిప్పోపై రాళ్లు, కట్టెలు విసిరారు. చివరికి పౌల్​ను ఉమ్మేసి హిప్పో వెళ్లిపోయింది. వెంటనే అతన్ని హాస్పిటల్​కు తీసుకెళ్లగా బాబుకేం పర్వాలేదని డాక్టర్లు చెప్పారు.