మంగపేట మండలంలో..అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

మంగపేట మండలంలో..అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం

మంగపేట, వెలుగు :  మండలంలోని శనిగకుంట గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు కాలిపోయింది.  ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామానికి చెందిన పెద్దల దేవేందర్ తమ ఇంటి సమీపంలోని బోరుబావి వద్దకు వెళ్లగా .. ఆకస్మాత్తుగా ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి.  

కొద్ది సేపటికి మంటలు అంటుకున్నాయి.    ఇంట్లో  బట్టలు, నగదుతో సహా బియ్యం బీరువా కాలిపోయి సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు వాపోయాడు.  తమను ప్రభుత్వం ఆదుకోవాలని దేవేందర్ రజిత దంపతులు కోరారు.