మీనాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

మీనాక్షి అమ్మవారి  బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

తమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్లలగర్ వైగై నదీ ప్రవేశ సేవలు సాగుతున్నాయి. స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపునకు భారీగా భక్తులు హాజరయ్యారు.  ఈ ఉత్సవానికి రాష్ట్రం నుంచే కాక.. పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమిషనర్ సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో 4 వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. దేవాదాయ అదనపు కమిషనర్ కన్నన్, కలెక్టర్ అనీశ్ శేఖర్ బందోబస్తును పరిశీలించారు.

మరిన్ని వార్తల కోసం

ఎల్​కేజీ, యూకేజీ స్టూడెంట్లను లెక్కలోకి తీసుకోవట్లే!

తెలంగాణలో రాహుల్ టూర్ ఖరారు!