కాటేదాన్‌లో భారీ అగ్ని ప్రమాదం

 కాటేదాన్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌లోని కాటేదాన్‌ పారిశ్రామికవాడలో గురువారం (డిసెంబర్ 21న) రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్‌లోని హగ్గీస్ పరిశ్రమలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పరిశ్రమ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.