చూయింగ్ గమ్ తిరస్కరించిందని భర్త తలాక్‌ చెప్పేశాడు

చూయింగ్ గమ్ తిరస్కరించిందని భర్త తలాక్‌ చెప్పేశాడు

లక్నో: ట్రిపుల్ తలాక్ ని అడ్డంగా పెట్టుకుని చీటికి మాటికి విడాకులు ఇస్తున్నారని..దీనిని బ్యాన్ చేస్తూ ఇటీవలే సుప్రీం సంచలన తీర్పు ఇచ్చినప్పటికీ కొందరి తీరు ఇంకా మారడంలేదు. చిన్న విషయానికే తలాక్ తలాక్ తలాక్ చెప్పేశాడు. ఇంతకీ భార్య చేసిన తప్పేంటో తెలుసా..! భర్త ఇచ్చిన చూయింగ్ గమ్ తినలేదని తలాక్ చెప్పేశాడు. ఈ సంఘటన లక్నోలో జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

లక్నోలోని రశీద్‌ అనే వ్యక్తి తన భార్య సిమ్మికి చూయింగ్‌ గమ్‌ ఇవ్వగా ఆమె తినలేదని ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు.  దీనిపై సిమ్మి మాట్లాడుతూ.. ‘తాను 2004లో సయ్యద్‌ రశీద్‌ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నాను. వివాహమైనా కొద్ది రోజుల్లోనే తనను, తన కుటుంబాన్ని వరకట్నం కోసం తీవ్రంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే అతనిపై నమోదైన కేసు విచారణలో భాగంగా సివిల్‌ కోర్టులో వాదనలు వినిపించడానికి రాగా, భర్త తనకు చూయింగ్‌ గమ్‌ ఇచ్చాడని దీనిని తాను తిరస్కరించగా ఈ కారణంతో మూడుసార్లు తలాక్‌ చెప్పి వెళ్లిపోయాడు. అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు సంబంధించి వాజిర్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. అయితే వారి కుటుంబ కలహాల అంశం కోర్టు పరిధిలో ఉన్న కారణంగా తాము ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు పోలీసులు.