నా కొడుకు బతికుండగానే కోడలికి వితంతు పెన్షన్ ఎట్లిస్తరు?: తల్లి ఆవేదన

నా కొడుకు బతికుండగానే కోడలికి వితంతు పెన్షన్ ఎట్లిస్తరు?: తల్లి ఆవేదన

భర్త బతికుండగానే మూడేళ్లుగా వితంతు పెన్షన్ తీసుకుంటోంది హైదరాబాద్‌లోని అల్విన్ కాలనీ ధరణి నగర్‌లో ఉంటున్న దివ్య. భర్త సుభాష్ బతికుండగానే పెన్షన్ తీసుకుంటోంది. తన కొడుకు బతికుండగానే కోడలికి పెన్షన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుభాష్ తల్లి. అధికారుల తెలివి ఎటు పోయిందని ప్రశ్నించింది. తన కొడుక్కు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది సుభాష్ తల్లి. ఇలా వితంతు పెన్షన్ రాయించింది తన కోడలి తల్లే అని, డబ్బు కోసం తన కొడుకును ఆ ఇద్దరూ చంపేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం భర్త ఉన్నాడో లేడో ఎంక్వైరీ చేయకుండా అధికారులు అలా పెన్షన్ ఇచ్చేయడమేంటని సుభాష్ తల్లి ప్రశ్నిస్తోంది. తన కొడుకును ఇంట్లో కనిపించొద్దంటూ కోడలు కొడుతోందని, మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదని చెప్పిందామె. అతడి ప్రాణానికి ఏమైనా అయితే తన కోడలు, ఆమె తల్లిదే బాధ్యత అని చెప్పింది.

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రంలో నిరుద్యోగులు తక్కువే.. రాజకీయ నిరుద్యోగులే ఎక్కువైనరు

పనికి రాని వస్తువులతో ఐరన్‌ మ్యాన్ సూట్‌ తయారు చేసిన కుర్రోడు

ఏది పడితే అది అడగొద్దు: ఎమ్మెల్యే సీతక్కపై సీఎం కేసీఆర్ ఆగ్రహం