స్క్రాప్‌తో ఐరన్‌ మ్యాన్ సూట్‌

స్క్రాప్‌తో ఐరన్‌ మ్యాన్ సూట్‌

హాలీవుడ్‌ సూపర్‌‌ హీరో ఐరన్ మ్యాన్ సినిమా మనందరికీ వినోదం.. ఆ కుర్రాడికి మాత్రం విజ్ఞానం! ఐరన్ మ్యాన్ సాహసాలను చూసి అంతా ఎంజాయ్ చేస్తే.. అతడు ఐరన్ మ్యాన్ సూట్ మెకానిజంపై దృష్టి పెట్టాడు. మెకానికల్ ఇంజనీర్ అవ్వాలన్న ఆశలకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో సొంతంగా ఏదైనా చేయాలని బర్రకు పదును పెట్టాడు. చేతిలో డబ్బు లేకపోయినా క్రియేటివ్‌గా ఆలోచించి.. మనం వాడి పడేసే ఎలక్ట్రానిక్ స్క్రాప్‌ (వేస్ట్ వస్తువులు)తో ఐరన్ మ్యాన్ సూట్ తయారు చేశారు. ఆ కుర్రాడి పేరు నింగోంబమ్‌ ప్రేమ్‌. 21 ఏండ్ల ఈ కుర్రాడి స్వస్థలం మణిపూర్ రాష్ట్రంలోని ఓ చిన్న టౌన్ హీరోక్‌. అతడు తయారు చేసిన ఐరన్ మ్యాన్ సూట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా కంట పడింది. పనికిరాని వస్తువులతో రోబోటిక్ సూట్ ఎలా తయారు చేశాడన్న ఆసక్తితో తన టీమ్‌ను ప్రేమ్ ఇంటికి పంపారాయన. అద్భుతమైన అతడి టాలెంట్‌కు ఆశ్చర్యపోయిన ఆనంద్.. ప్రేమ్‌ కుటుంబానికి అండగా నిలుస్తానని ప్రకటించారు. తన కంపెనీ చీఫ్​ డిజైన్‌ ఆఫీసర్ ప్రతాప్ బోస్‌ ఆ కుర్రాడికి మెంటార్‌‌గా ఉండి శిక్షణ ఇస్తారంటూ ట్వీట్ చేశారు. ప్రేమ్‌ది పేద కుటుంబం కావడంతో అతడితో పాటు సోదరుల చదువులకు మహింద్రా ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు.

తనకు మెకానికల్ ఇంజనీర్ కావాలని ఆశ అని.. కానీ డబ్బులు లేకపోవడం వల్ల ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరానని ప్రేమ్ చెబుతున్నాడు. ఐరన్ మ్యాన్ సినిమా చూశాక దాని మెకానిజం ఆసక్తికరంగా అనిపించి, తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందని చెప్పాడు. అయితే దీని తయారీకి కూడా చాలా డబ్బులు కావాలని అర్థమైందని, దీంతో వేస్ట్‌గా పడేసే ఎలక్ట్రానిక్ వస్తువులు, అడ్డముక్కలతో దీనికి చేయాలని ఫిక్స్ అయ్యాడు. 2015 నుంచి ఐరన్‌ మ్యాన్ సూట్ తయారీపై దృష్టి పెట్టానని, గత ఏడాదిలో ఒక తుది రూపానికి తీసుకురాగలిగానని చెప్పాడు ప్రేమ్. తన తల్లి చిన్న పాటి షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోందని, ఇల్లు గడవడం కష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని టూల్స్‌కు అవసరమైన డబ్బులు ఇచ్చి ప్రోత్సాహించిందని తెలిపాడు.

For More News..

టాటా చేతికి ఎయిర్ ఇండియా.. కొట్టిపారేసిన కేంద్రం

పండుగ స్పెషల్ ఆఫర్: ఫోన్ కొంటే ఎయిర్‌‌ పోడ్స్ ఫ్రీ