పండుగ స్పెషల్ ఆఫర్: ఫోన్ కొంటే ఎయిర్‌‌ పోడ్స్ ఫ్రీ

పండుగ స్పెషల్ ఆఫర్: ఫోన్ కొంటే ఎయిర్‌‌ పోడ్స్ ఫ్రీ

ఇండియన్స్ కోసం యాపిల్ కంపెనీ ఈ పండుగ సీజన్‌లో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఐఫోన్లపై దసరా ఆఫర్లు ప్రకటించగా.. ఆ వరుసగా యాపిల్ కంపెనీ కూడా చేరింది.  ఐఫోన్ 12 లేదా ఐఫోన్‌ 12 మినీ ఏదైనా యాపిల్ స్టోర్‌‌లో కొనుగోలు చేస్తే ఎయిర్‌‌పోడ్స్ ఫ్రీగా ఇస్తామని యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు తమ ఆఫర్ సేల్‌ను మూడో తేదీ నుంచే మొదలుపెడుతుండగా.. యాపిల్ కంపెనీ ఆఫర్ అక్టోబర్ 7 నుంచి మొదలు కానుంది.

ఐఫోన్‌ 12 మినీ మోడల్స్ రేటు రూ.59,900 నుంచి ఉన్నాయి. అలాగే ఐఫోన్‌ 12 రేటు రూ.65,900 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు యాపిల్ కంపెనీ ప్రకటించిన ఆఫర్‌‌లో ఫోన్ ధర ఏమాత్రం తగ్గించడం లేదు.. అయితే ఫోన్‌కు ఫ్రీగా ఎయిర్‌‌పోడ్స్ అందిస్తుంది. కస్టమర్ ఏ మోడల్ ఎయిర్‌‌పోడ్స్ అయినా తీసుకోవచ్చని యాపిల్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. చార్జింగ్‌ కేస్ సహా ఎయిర్‌‌ పోడ్స్ సెట్ లేదా ఎయిర్‌‌పోడ్స్ ప్రో ఏదైనా తీసుకోవచ్చని తెలిపింది. మామూలుగా ఎయిర్‌‌పోడ్స్‌ను వైర్‌‌లెస్‌ చార్జింగ్‌ కేస్‌తో కలిపి కొనాలంటే రూ.18,900 ఉంటుంది. అదే ఎయిర్‌‌పోడ్స్ ప్రో అయితే రూ.24,900 ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం..

కేన్సర్​ మందుల​​ పరిశోధనలో తెలంగాణ బిడ్డ

రికార్డు స్థాయిలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

మోడీ పథకాలను ఒక పాఠంలాగా ప్రజలకు చెప్పాలి