టాటా చేతికి ఎయిర్ ఇండియా.. కొట్టిపారేసిన కేంద్రం

టాటా చేతికి ఎయిర్ ఇండియా.. కొట్టిపారేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను టాటా సన్స్ హస్తగతం చేసుకుందని మీడియాలో వస్తున్న కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్ని కొట్టిపారేసిన కేంద్రం.. వీటిలో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేసింది. ఎయిర్ ఇండియా వాటాల విక్రయానికి సంబంధించిన బిడ్‌పై ప్యానెల్ నిర్ణయాన్ని త్వరలో మీడియాకు తెలియజేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

కాగా, అప్పుల్లో ఉందనే కారణంగా ఎయిర్ ఇండియాలోని పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పలు ప్రైవేట్ కంపెనీలు బిడ్ దాఖలు చేశాయి. ఈ లిస్టులో టాటా సన్స్ ఎక్కువ బిడ్ దాఖలు చేసి ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుందని మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా కేంద్రం ఈ విషయంపై స్పందించడంతో దీనికి బ్రేక్ పడింది. ఇకపోతే, ఎయిర్ ఇండియాను 1932 లో జేఆర్‌డీ టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విమానయాన రంగాన్ని జాతీయం చేయడంతో ఎయిర్ ఇండియాలో టాటా ఎయిర్‌లైన్స్‌కు ఉన్న 49 శాతం వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ఆ తర్వాత కంపెనీని అప్పటి సర్కార్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చింది.  

మరిన్ని వార్తల కోసం: 

ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా?  

ఆమ్దానీ కోసం సర్కార్‌కు లిక్కరే కావాల్నా!

దేశంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ

కంటెయినర్, బస్సు ఢీ.. ఏడుగురు మృతి