దేశంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ

దేశంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ

జైపూర్:దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ‘‘మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య సేవల మధ్య లోటును వీలైనంతగా తగ్గిస్తున్నాం. ఇందులో భాగంగా ఆరేళ్లలో 170కి పైగా మెడికల్ కాలేజీలు తెచ్చాం. ఇంకో 100కు పైగా కాలేజీలు రానున్నాయి. ప్రివెంటివ్ మెడిసిన్ కు చాలా ప్రాధాన్యమిస్తున్నాం. ఆయుర్వేదం, యోగాను ప్రమోట్ చేస్తున్నాం” అని ప్రధాని వివరించారు. రాజస్థాన్ లో  బన్స్ వారా, సిరోహీ, హనుమాన్ గఢ్, దౌసా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మోడీ గురువారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. జైపూర్ లో ఏర్పాటు చేసిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పనితీరుపై, పారదర్శకతపై ఎన్నో ఆరోపణలొచ్చేవని గుర్తు చేశారు. ‘‘ఎంసీఐ పనితీరుపై వచ్చిన ఆరోపణలు మెడికల్ ఎడ్యుకేషన్ ను, హెల్త్ కేర్ సర్వీసులను బాగా దెబ్బ తీశాయి. ఎంసీఐ స్థానంలో వచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ తో పరిస్థితి మెరుగైంది. అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ సక్సెసే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే 88 కోట్లకు పైగా డోసులిచ్చాం. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ సంఖ్య 6 నుంచి 22కు పెరిగింది. మెడికల్ సీట్లు 82 వేల  నుంచి 1.4 లక్షలకు పెరిగాయి. మెడికల్ ఎడ్యుకేషన్ అందరికీ దక్కాలని ఓబీసీ, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలకు కూడా మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు తెచ్చాం” అని మోడీ చెప్పారు. 

త్వరలో పిల్లల వ్యాక్సిన్: మాండవీయ

పిల్లలకు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ చెప్పారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉందన్నారు. కేరళ, మహారాష్ట్రల్లో కరోనా కేసులు పెరుగుతుండటంపై దృష్టి పెట్టామన్నారు. దేశాభివృద్ధి ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉందని, ఆ రెండింటినీ లింక్ చేసేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. ‘‘సీఎంగా గుజరాత్ లో 20 ఏళ్ల క్రితం మోడీ తెచ్చిన ‘‘మా అమృత్ యోజన’’ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 40కి పైగా పెట్రో కెమికల్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్లు తమ నిర్వహణ ఆదాయాన్ని సొంతంగానే సంపాదించుకుంటున్నాయి. ఏటా లక్ష మంది స్టూడెంట్లను తయారు చేస్తూ 95 శాతం ప్లేస్ మెంట్లు కల్పిస్తున్నాయి. అలాగే రాజస్థాన్ లో మరో 17 మెడికల్ కాలేజీలు రానున్నాయి” అని చెప్పారు.  

మన లా మినిస్టర్ మంచి డ్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: మోడీ

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌‌‌‌‌‌‌‌ రిజిజు మంచి డ్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ప్రధాని నరేంద్ర మోడీ పొగిడారు. వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టులను పరిశీలించడానికి అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని కజలంగ్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి మంత్రి రిజిజు బుధవారం వెళ్లారు. సాజోలాంగ్‌‌‌‌‌‌‌‌ ట్రెడిషనల్ డ్యాన్స్ తో మంత్రికి గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామస్తులతోపాటు మంత్రి రిజిజు కూడా డ్యాన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. తాను డ్యాన్స్ చేసిన వీడియోను మంత్రి ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ వీడియో చూసిన మోడీ ఆయనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ‘‘మన లా మినిస్టర్ మంచి డ్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌ లోని అద్భుతమైన కల్చర్ ను చూడడం ఆనందంగా ఉంది’’ అని మోడీ పేర్కొన్నారు.