రాష్ట్రంలో నిరుద్యోగులు తక్కువే.. రాజకీయ నిరుద్యోగులే ఎక్కువైనరు

రాష్ట్రంలో నిరుద్యోగులు తక్కువే.. రాజకీయ నిరుద్యోగులే ఎక్కువైనరు

పరిశ్రమలు రావడం వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి కేటీఆర్..ఐటీ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ పురోగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గతం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని తెలిపారు కేటీఆర్. రాష్ట్రంలో నిరుద్యోగులు తక్కువే.. కానీ రాజకీయ నిరుద్యోగులు ఎక్కువయ్యారని ఎద్దేవా చేశారు. పాలమూరు పచ్చ పడుతుంటే ప్రతిపక్షాల కండ్లు పచ్చ పడుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం మనకు కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి.. మహారాష్ట్రకు ఇచ్చిందని, కేంద్ర  ప్రభుత్వం ఇవ్వక పోయినా ప్రైవేట్ కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. కేటీఆర్ ప్రసంగం అనంతరం మండలి సోమవారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తల కోసం..

5 నెలల చిన్నారిపై హత్యాచారం.. ఏ శిక్ష వేసినా తక్కువేనన్న జడ్జి

పండుగ స్పెషల్ ఆఫర్: ఫోన్ కొంటే ఎయిర్‌‌ పోడ్స్ ఫ్రీ

స్క్రాప్‌తో ఐరన్‌ మ్యాన్ సూట్‌ చేసిన నిరుపేద కుర్రోడు