ప్రశ్నించే హక్కు ఉందని ఏదిపడితే అది అడగొద్దు

ప్రశ్నించే హక్కు ఉందని ఏదిపడితే అది అడగొద్దు

సర్పంచ్ లు గత పాలకుల హయాంలో బాధపడ్డారు కానీ..ఇపుడు బాధపడటం లేదన్నారు సీఎం కేసీఆర్. ఏది ఏమైనా పంచాయతీలకు నిధులు ఆపొద్దని చెప్పామన్నారు. నిధుల మళ్లింపు లేదన్నారు. ప్రశ్న అడిగే హక్కు ఉందని ఏది పడితే అది అడగొద్దన్నారు.   పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులుండవన్నారు. కేంద్ర దయాదాక్షిణ్యం ఏమి లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిందేన్నారు. కాంగ్రెస్ హయాంలోని పీడబ్ల్యూఎస్ నిధులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయన్నారు. అవగాహన లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామా? అని ప్రశ్నించారు. తమాషాగా జీవోలిస్తలేమన్నారు.  ప్రభుత్వ పనితీరును చాలా మంది ప్రశంసిస్తున్నారన్నారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పొగుడుతున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ,కేంద్రం ఇచ్చిన నిధుల గురించి త్వరలో చెబుతానన్నారు కేసీఆర్. తెలంగాణలో అనేక గ్రామాల సర్పంచ్ లకు కేంద్రం అవార్డులు ఇచ్చిందన్నారు. ఇప్పుడు మాట్లాడే సభ్యుల పార్టీలు గతంలో పాలన చేశారన్నారు. గతంలో ఒక వ్యక్తిమీద రూ.4 విడుదల చేస్తే తాము రూ.600 లకు పైగా ఇస్తున్నామన్నారు.

see more news

చైనాకు సీక్రెట్‌‌‌‌‌‌‌‌ కాల్స్ చేశాం .. ఒప్పుకున్నఅమెరికా ఆర్మీ జనరల్‌‌‌‌

సీతక్క వర్సెస్ స్పీకర్: ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా?