స్ట్రీమ్ ఎంగేజ్: టీచర్​కి యుద్ధం నేర్పిన పాఠం

స్ట్రీమ్ ఎంగేజ్: టీచర్​కి యుద్ధం నేర్పిన పాఠం

ఆ మాన్షన్​లో ఏం జరిగింది?

టైటిల్ : అశ్విన్స్

లాంగ్వేజ్​ : తెలుగు

కాస్ట్​ : వసంత్ రవి, మురళీధరన్, విమలా రామన్, సరస్వతి మెనన్, ఉదయ దీప్

డైరెక్షన్ : తరుణ్​ తేజ, ప్లాట్ ఫాం: నెట్​ఫ్లిక్స్

ఆర్తి రాజగోపాలన్​ (విమలా రామన్) ఆర్కియాలజిస్ట్​. మత సంప్రదాయాలు బాగా తెలిసిన వ్యక్తి. ఆమెకి చెందిన ఒకప్పటి పాత మాన్షన్​లో దెయ్యాలున్నాయని ప్రచారంలో​ ఉంటుంది. ఆ బిల్డింగ్​లోకి వెళ్లడం డేంజర్​ అని తెలిసినా అర్జున్ (వసంత్), రితూ (సరస్వతి) వాళ్ల ఫ్రెండ్స్​తో కలిసి యూట్యూబ్​ వీడియో కోసం ఆ బిల్డింగ్​లోకి వెళ్తారు. అప్పటి నుంచి వాళ్లలో ప్రతి ఒక్కరికీ ఒక ఎక్స్​పీరియెన్స్​ ఎదురవుతుంది. చివరికి వాళ్లు చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు అర్జున్​కి దెయ్యాల బారి నుంచి ఫ్రెండ్స్​ని కాపాడుకునేందుకు ఒకే ఒక ఛాన్స్​ ఉంటుంది. మరి అర్జున్ వాళ్లను కాపాడుకున్నాడా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో వసంత్​ రవి పర్ఫార్మెన్స్​ చాలా బాగుంది. బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​, హారర్ సీన్స్​ బాగున్నాయి. పురాణాలకు లింక్​ పెట్టి తీసిన కథ ఇది. ఆ లింక్​ ఏంటనేది ఇంట్రెస్టింగ్​ పాయింట్. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు కచ్చితంగా నచ్చుతుంది. 

టీచర్​కి యుద్ధం నేర్పిన పాఠం

టైటిల్ : బవాల్

లాంగ్వేజ్​ : హిందీ, తెలుగు

కాస్ట్​ : వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, ముఖేష్​ తివారి, మనోజ్, శశి వర్మ, అంజుమన్ సక్సేనా 

డైరెక్షన్ : అశ్విని అయ్యర్ తివారి

ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో

అజ్జూ సర్ (వరుణ్) ఓ స్కూల్లో హిస్టరీ టీచర్. అతనికి లక్నోలో చాలా పాపులారిటీ ఉంటుంది. ఎప్పుడూ ఇమేజ్ కాపాడుకోవాలి, పాపులారిటీ పెంచుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. అందులో భాగంగానే డబ్బు, సమాజంలో గౌరవం ఉన్న ఫ్యామిలీలో బాగా చదువుకున్న అమ్మాయి (నిషా)ని పెండ్లి చేసుకుంటాడు. తనకి ఫిట్స్​ వ్యాధి ఉందని పెండ్లికి ముందే అజ్జూతో చెప్తుంది నిషా. అయినా పర్వాలేదు అంటాడు. కానీ, పెండ్లయిన కాసేపటికి ఆమెకి ఫిట్స్ వస్తాయి. అప్పటినుంచి ఆమెని దూరం పెడతాడు. ఒకరోజు నిషా మీద కోపంతో..  క్లాసులో వరల్డ్ వార్​ గురించి డౌట్ అడిగిన అబ్బాయిని కొడతాడు. ఆ అబ్బాయి ఎమ్మెల్యే కొడుకు. దాంతో అజ్జూని సస్పెండ్ చేయమంటాడు ఎమ్మెల్యే. ‘‘నేను మంచి టీచర్​ని. కావాలంటే వరల్డ్ వార్ జరిగిన ప్లేస్​లకు వెళ్లి పిల్లలకు డిజిటల్ క్లాస్​లు చెప్తా” అంటాడు. తనతోపాటు నిషాని కూడా వెంట తీసుకెళ్తాడు. మరి అజ్జూ సర్​ మంచి టీచర్​ అనిపించుకున్నాడా? అజ్జూ, నిషా కలిసిపోయారా? లేదా? అనేది మిగతా కథ. అయితే, ఈ సినిమాలో వరల్డ్​ వార్​కి, రియల్​ లైఫ్ ఎమోషన్స్​కి ముడిపెట్టి కథ చెప్పిన విధానం కొత్తగా ఉంటుంది. డైలాగ్స్ మనసును హత్తుకుంటాయి. వరుణ్​, జాన్వీ పర్ఫార్మెన్స్ బాగుంది. 

మెసేజ్​ ఇచ్చే సస్పెన్స్ థ్రిల్లర్

టైటిల్ : ధూమం

లాంగ్వేజ్​ : మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ

కాస్ట్​ : ఫహద్​ ఫాజిల్, అపర్ణ బాలమురళీ, రోషన్ మ్యాథ్యూ, వినీత్​, అచ్యుత్ కుమార్, మేబల్ థామస్, అను మోహన్,

డైరెక్షన్ : పవన్​ కుమార్

ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో

అవినాశ్ (ఫహద్ ఫాజిల్) ఒక సిగరెట్ కంపెనీలో సేల్స్ హెడ్​గా పనిచేస్తుంటాడు. తన తెలివితేటలతో కంపెనీ సేల్స్ పెంచుతాడు. సిగరెట్ కంపెనీ ఎం.డీ  సిద్ధార్థ్​ (రోషన్​ మాథ్యూ) అవినాశ్​ని ఉద్యోగిలా కాకుండా ఫ్రెండ్​లా చూస్తాడు. అనుకోకుండా వాళ్లిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. దాంతో అవినాశ్​ ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. ఆ తర్వాతి రోజు భార్య దియా (అపర్ణ)తో కలిసి కారులో వెళ్తుండగా ఒక వ్యక్తి అటాక్ చేసి డ్రగ్ ఇంజెక్షన్​ ఇస్తాడు అవినాశ్​కి. మత్తులో నుంచి బయటకు వచ్చేసరికి అవినాశ్​ ఒక కొండ ప్రాంతంలో ఉంటాడు. ఒక వ్యక్తి ఫోన్​ చేసి ‘‘దియా బాడీకి మైక్రో బాంబ్ ఫిక్స్ చేశా. మేం చెప్పింది చేయకపోతే ఆమె ప్రాణాలు తీస్తాం. కోటి రూపాయలను మేం చెప్పిన అడ్రెస్​లో ఇవ్వాల”ని బెదిరిస్తాడు. సిగరెట్​ కంపెనీ సీక్రెట్స్​ తనకు తెలుసు కాబట్టి సిద్ధార్థే ఈ ట్రాప్​లో ఇరికించాడని అనుకుంటాడు అవినాశ్. అవినాశ్​ ఆలోచన నిజమైందా? ఆ ట్రాప్​ నుంచి ఎలా బయటపడతాడు? అసలు ఈ సినిమా ద్వారా సిగరెట్ స్మోకింగ్ గురించి ఇచ్చే మెసేజ్​ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో ఫహద్, అపర్ణ, రోషన్​ల యాక్టింగ్ బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్​గా సాగే ఈ సినిమా స్మోకింగ్​ గురించి చాలా విషయాలు తెలియజేస్తుంది. క్లైమాక్స్​ సర్​ప్రైజ్​ చేస్తుంది.