పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య.. సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌ మండలంలో ఘటన

పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య.. సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌ మండలంలో ఘటన
  •     సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో ఘటన

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రేమ పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌ మండలం పెద్దలింగారెడ్డిపల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకు చెందిన మాదన్నగారి శ్రావణ్ (24) వ్యవసాయం చేస్తున్నాడు.

పెద్దకోడూరు గ్రామానికి చెందిన బోనాల నవ్యశ్రీ (17) డిగ్రీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ చదువుతోంది. వరుసకు బావామరదళ్లు అయిన వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో నవ్యశ్రీ మైనర్‌‌‌‌‌‌‌‌ కావడం, ఆమెకు పెండ్లి కాని అక్క  ఉండడంతో వీరి పెండ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌‌‌‌‌‌‌‌, నవ్యశ్రీ సోమవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం పెద్దలింగారెడ్డి పల్లి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌ (మడికొండ), వెలుగు : ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆవుల ప్రణయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ (24), అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమెను మరో ఊరిలో ఉంటున్న మేనమామ ఇంటికి పంపించారు.

ఇటీవల యువతి మేనమామ ప్రణయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి బెదిరించడంతో మనస్తాపానికి గురైన యువకుడు సోమవారం ఉదయం ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన అతడి తల్లి చుట్టుపక్కల వారిని పిలువగా వారు వచ్చి చూసే సరికే చనిపోయాడు. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడం, ఆమె మేనమామ బెదిరించడం వల్లే ప్రణయ్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.