కారు నెంబర్ ప్లేట్ పై ‘నాన్న’ పేరు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

కారు నెంబర్ ప్లేట్ పై ‘నాన్న’ పేరు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

ఉత్తరాఖండ్ లో ఓ వ్యక్తి తన కారు నెంబర్ ప్లేట్ పై హిందీలో పాపా (నాన్న) అని రాయించుకున్నందుకు అతడికి పోలీసులు షాక్ ఇచ్చారు. నాన్న అనే పేరుతో ఉన్న కారులో దర్జాగా తిరుగుతున్న యజమానిని అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ స్థానంలో ఇలా పేర్లు ఉండకూడదంటూ సదరు యజమానికి జరిమానా విధించారు. 

ఉత్తరాఖండ్ పోలీసులకు ఓ వ్యక్తి ఈ కారు ఫొటోని పంపి ట్విట్టర్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో రంగలోకి దిగిన పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. కారు ఓనర్ కి ఫైన్ వేసి.. నంబర్ ప్లేట్ మార్పించారు. ఆ తర్వాత పోలీసులే ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కారుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ కారు ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. వాహనాల నంబర్ ప్లేట్లపై ఎవరికి నచ్చినట్లు వారు రాసుకుంటే కుదరంటున్నారు పోలీసులు. వెహికిల్ నంబర్ మాత్రమే ఆ ప్లేటుపై ఉండాలని, అవి కూడా ఒకే వరుసలో ఉండాలని సూచిస్తున్నారు. 

ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాల రీత్యా వాహానాల రిజిస్ట్రేషన్‌ నిబంధనలు నుంచి ట్రాఫిక్‌ రూల్స్‌ వరకు అన్ని కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే వాహనదారులు చేస్తున్న తప్పిదాలు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు వంటి విషయాల్లో సోషల్‌ మీడియా వేదికగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.