ఈఫిల్ టవర్ ముందు డ్యాన్స్ చేస్తూ ప్రియురాలికి లవ్ ప్రపోజల్

ఈఫిల్ టవర్ ముందు డ్యాన్స్ చేస్తూ ప్రియురాలికి లవ్ ప్రపోజల్

తమకు నచ్చిన అమ్మాయికి ఒక్కో వ్యక్తి ఒక్కో స్టైల్లో లవ్ ప్రపోజల్ చెబుతుంటారు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా నచ్చిన విధంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. కొందరు చాలా డిఫరెంట్ గా ఆలోచించి..తమ ప్రియురాలికి లవ్ ప్రపోజల్స్ చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి తన ప్రియురాలికి లవ్ ప్రపోజల్ చేసి వార్తల్లో నిలిచాడు. 

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మూవీ ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ లోని ‘కోయీ మిల్‌ గయా’ పాటకు స్టెప్పులేస్తూ ఓ వ్యక్తి తన ప్రియురాలికి పెళ్లి ప్రతిపాదన చేశాడు. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ ముందు ఈ లవ్ ప్రపోజల్ చేయడం విశేషం. ప్రియుడు డ్యాన్స్‌ చేస్తూ లవ్ ప్రపోజ్‌ చేస్తుంటే.. ప్రియురాలు కూడా ఆనందంతో కలిసి స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  

ప్రేమ జంట డ్యాన్స్ చేస్తుంటే వారి వెనుకాల కొవ్వొత్తుల వెలుగుల నడుమ ఎర్రని రోజా పూలతో తీర్చిదిద్దిన మ్యారీ మీ అనే సింబల్‌ కనిపిస్తోంది. 44 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను సచిన్‌ టాండన్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ పోస్ట్‌ చేశాడు. ఈ నెల 15న పోస్టు చేసిన ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. కొంతమంది అతని క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం పబ్లిక్ దృష్టిని మళ్లించడానికే ఇలాంటివి చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు.