వాగు లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు ..సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన యాదాద్రి పోలీసులు

వాగు లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు ..సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన యాదాద్రి పోలీసులు

యాదాద్రి, వెలుగు : వాగు దాటుతూ నీటిలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు రక్షించిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. బీబీనగర్ మండలం రావిపహాడ్​ తండా,  భువనగిరి మండలం అనాజీపురం మధ్యలోని చిన్నేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 

లోలెవల్​ బ్రిడ్జిపై నుంచి దాటేందుకు బీబీనగర్​మండలం మాధారం గ్రామానికి చెందిన వెల్వర్తి మహేశ్​శుక్రవారం ప్రయత్నించారు. ఆ సమయంలో వరద ఉధృతి మరింత పెరగడంతో జారి పడిపోయాడు. అయితే బ్రిడ్జికి ఉన్న పిల్లర్​ను గట్టిగా పట్టుకుని కేకలు వేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా జేసీబీ తో వెళ్లారు. లోలెవల్​ బ్రిడ్జి మధ్యకు వెళ్లి మహేశ్​ను పైకిలాగి రక్షించారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు.