
వికారాబాద్ జిల్లా తాండూర్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో లో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కర్ణాటకకు చెందిన గురుకుంటకు చెందిన అడిగి సంగమేశ్వర్ తన భార్యతో కలిసి ఎన్టీఆర్ కాలనీ లో నివాసముంటూ పాల్సింగ్ యూనిట్లో పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల కిందట తన భార్య ఆమె అక్క ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. వాళ్ల అక్కా బావా తన భార్యను కాపురానికి పంపించడం లేదని మనస్తాపానికి గురై బ్లేడ్ తో గొంతు పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు వెంటనే అతనిని తాండూర్ ఆసుపత్రికి తరలించారు.