గుట్కా ప్యాకెట్లలో రూ.33 లక్షలు

గుట్కా ప్యాకెట్లలో రూ.33 లక్షలు

బుర్రకో బుద్ది జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ఇక్కడ ఓ వ్యక్తి కూడా తన అతి తెలివిని ఉపయోగించాడు. కానీ, టైమ్ బాగోలేక వర్కౌట్ కాలేదు.చివరకు కస్టమ్స్  ఆఫీసర్లకు అడ్డంగా దొరికిపోయాడు. 

అసలేం జరిగింది..? 

ఓ వ్యక్తి యూఎస్ కరెన్సీని ప్యాక్ చేసి.. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కి తరలించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఒక బ్యాగులో వందలకొద్ది పాన్ మసాల ప్యాకెట్లను తీసుకొస్తూ కోల్ కత్తా ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో బ్యాగులో ఉన్న పాన్ మసాల ప్యాకెట్లపై అనుమానం కల్గింది. దాంతో పాన్ మసాల ప్యాకెట్లను నిశీతంగా పరిశీలించడంతో కస్టమ్స్ అధికారులకు మరింత అనుమానం వచ్చింది. 

కొన్ని పాన్ మసాల ప్యాకెట్లను ఓపెన్ చేసి చూడగా అందులో యూఎస్ డాలర్లకు సంబంధించిన కరెన్సీ నోట్లు కనిపించడంతో కోల్‌కత్‌ కస్టమ్స్ అధికారులు ఖంగుతిన్నారు. దాదాపు రూ.32 లక్షల విలువ చేసే యూఎస్‌ కరెన్సీని ప్యాక్‌ చేసి బ్యాంకాక్ కు తరలించేందుకు ప్యాసింజర్ ప్రయత్నించాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కోల్‌కతా కస్టమ్స్‌ అధికారులు విడుదల చేశారు. గుట్కా పౌచుల్లో రహస్యంగా దాచిన అమెరికా డాలర్‌ నోట్లను వెలికి తీసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.