
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయపడగా, వీరిలో ఇద్దరి కండిషన్ క్రిటికల్‌గా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో 18 మంది చైనా వాళ్లేనని చెప్పారు. హ్వాసోంగ్ సిటీలో ఉన్న బ్యాటరీ ఫ్యాక్టరీ రెండో ఫ్లోర్లో ఉదయం 10:30 గంటలకు కార్మికులు బ్యాటరీలను టెస్ట్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నాయి.
దీంతో ఆ ఫ్లోర్లో ఉన్న బ్యాటరీలన్నీ వరుసగా పేలిపోయాయి. మంటలంటుకున్న సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 102 మంది పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడంతోనే చాలామంది ఫ్లోర్‌నుంచి బయటకు పరిగెత్తారన్నారు. కొద్ది నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది స్పాట్‌కు చేరుకుని మంటలార్పివేశారు. ప్రధాని హాన్ డక్సూ, మంత్రి లీ సాంగ్మిన్ సైట్‌ను పరిశీలించారు.