మేడారంలో మెడికల్‌‌ క్యాంప్‌‌

మేడారంలో మెడికల్‌‌ క్యాంప్‌‌

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు స్థానిక టీటీడీ కల్యాణమండపంలో మెడికల్‌‌ క్యాంప్‌‌ను ఏర్పాటు చేశారు. క్యాంప్‌‌ను డీఎంహెచ్‌‌వో అల్లెం అప్పయ్య, సర్పంచ్‌‌ చీడెం బాబురావుతో కలిసి ఆదివారం ఐటీడీఏ పీవో అంకిత్‌‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యం అందించాలని, డాక్టర్లు, పారా మెడికల్‌‌ సిబ్బంది జాతర పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

అనంతరం పస్రా సీఐ శంకర్‌‌, ఎస్సై శ్రీకాంత్‌‌రెడ్డితో మాట్లాడి భక్తుల రద్దీ గురించి అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా ముందస్తు మొక్కుల కోసం భక్తులు అత్యధికంగా వస్తున్నందున సిబ్బందిని పెంచాలని సూచించారు. బ్యాటర్‌‌ ట్యాప్‌‌లు, టెంపరరీ టాయిలెట్ల నిర్మాణ పనులు ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని గ్రామీణ నీటి సరఫరా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌‌ ఇంజినీర్‌‌ మధుకర్‌‌ను ఆదేశించారు. అనంతరం జంపన్న వాగు పరిసరాలను పరిశీలించారు.