బ్రెజిల్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌కు మెమొరీ లాస్‌‌‌‌

బ్రెజిల్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌కు మెమొరీ లాస్‌‌‌‌

బాత్‌‌‌‌రూమ్‌‌‌‌లో జారిపడటంతో తలకు దెబ్బ

సావోపాలో: బ్రెజిల్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ జెయిర్‌‌‌‌‌‌‌‌ బొల్సానారోకి టెంపరరీ మెమొరీ లాస్‌‌‌‌ అయింది. సోమవారం రాత్రి అల్వొరాబా ప్యాలెస్‌‌‌‌లోని తన బాత్‌‌‌‌రూమ్‌‌‌‌లో కాలుజారి పడిపోవడంతో తలకు దెబ్బ తగిలిందని, కొన్ని గంటల పాటు అన్ని మర్చిపోయానని బొల్సానారో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

“ కాలు జారి వెనక్కి పడిపోయాను. తలకు దెబ్బతగిలి కొంతసేపు గతం మర్చిపోయాను. ఆ తర్వాత నెమ్మదిగా అన్ని గుర్తొచ్చాయి అని” ఆయన అన్నారు.  బొల్సనారోను ఒక రోజంతా హాస్పిటల్‌‌‌‌లో ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించి మంగళ వారం ఉదయం డిశార్జ్‌‌‌‌ చేశారు.