
అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇళ్ల మధ్యలోకి కూడా వచ్చేస్తున్నాయి. ఏవో బయట ఉన్నవి తిని వెళ్లడం కాదు.. అవి కూడా మనుషులపై దాడి చేయడం ప్రారంభించాయి. రాజస్థాన్ లో ఓమహిళపై కోతులు దాడి చేసిన వీడియో ఇన్‌స్ట్రాగ్రామ్ లో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
కుక్కలు, ఏనుగులు, చిరుత పులుల దాడుల గురించి విన్నాం... ఇక ఇప్పుడు ఆ టైం కోతులకు వచ్చిందో ఏమో తెలియదు కాని.. కోతి బుద్దులు పోవు అన్న సామెతను నిజం చేస్తూ.. ఓ మహిళపై మంకీస్ దాడి చేసిన ఘటన రాజస్థాన్ అజ్మీరా లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. అజ్మీర్ జిల్లా రామ్‌నగర్ కాలనీలో ఉంటున్న ఓ మహిళ తన ఇంటి పెరట్లో కూర్చి వేసుకుని కూర్చుంది. అప్పటికే ఆ ప్రాంతంలో కోతుల మంద తిరుగుతోంది. ఈ క్రమంలో రెండు కోతులు మహిళనుటార్గెట్ చేసుకున్నాయి.
మహిళన తన పని చేసుకుంటుడగా.. ఆమె వెనకనున్న గోడపైకి సైలంట్‌గా కోతులు వచ్చాయి. అయితే కోతులు వచ్చిన విషయాన్ని ఆ మహిళ గమనించలేదు. ఒక కోతి గోడపై కూర్చొని జుట్టుపట్టుకుని లాగింది. ఎవరు లాగుతున్నారో అర్దం కాని స్థితిలో గట్టిగా అరిచింది. ఆ అరువులకు మరో కోతి కూడా వచ్చి జుట్టుపట్టుకుంది. మహిళ జుట్టును కోతులు లాగుతుంటే ఆమె కూడా పైకి లేస్తూ.. కిందకు వస్తూ ఉంది. ఇంతలో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి మహిళ కేకలు విని వచ్చి కోతులను తరిమేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హిందీలో క్యాప్షన్‌తో @beawar_live_news ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియో షేర్ చేయబడింది. ఆంగ్లంలోకి అనువదించబడినప్పుడు, “అజ్మీర్‌లో కోతుల భయంతో ప్రజలు కలత చెందుతున్నారు. (Viral Clip Of Monkeys Attack On Woman Will Send Chills Down Your Spine).
ఈ వీడియోను చూసిన జనాలు షాక్ కు గురవుతున్నారు. కోతుల బెడత ఎక్కువైతే ఇలాంటి ఘటనలే జరుగుతాయని నెటిజన్లు కామెంట్ చేశారు. కోతుల వలన పిల్లలకు చాలా ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాలు విస్తరిస్తున్న కొద్దీ అడవులు తరిగిపోతున్నాయి. చివరకు అడవుల్లోని జంతువులు జనావాసాల వైపు వస్తున్నాయి. ఫలితంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సో.. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గ్రహించాలి. అడవుల్లేకుండా చేస్తే ప్రకృతి వైపరీత్యాలే కాదు.. ఇంకా ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగే అవకాశాలున్నాయి. అందువలన అడవులను రక్షించేందుకు అందరూ పాటుపడాలి.