చాక్లెట్, అరటిపండుతో నోరూరించే చాకో పెంగ్విన్

చాక్లెట్, అరటిపండుతో నోరూరించే చాకో పెంగ్విన్

బ్రేక్​ఫాస్ట్, శ్నాక్  ఏదైనా... రోజూ ఒకేరకంగా  తినడానికి ఇష్టపడరు పిల్లలు. అందుకని అప్పుడప్పుడు వాళ్లకోసం కొత్త ఫుడ్​ వెరైటీలు చేయాలి. అవి కూడా పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్​, ఫ్రూట్స్​తో  రెసిపీలు చేస్తే  వదలకుండా తింటారు. అలాంటిదే చాకో పెంగ్విన్స్​. చాక్లెట్, అరటిపండుతో నోరూరించే చాకో పెంగ్విన్​ చేయొచ్చు అంటోంది క్లినికల్ న్యూట్రిషనిస్ట్ గురుప్రీత్ కౌర్.  

కావాల్సినవి: అరటిపండ్లు- 6, చాక్లెట్ (కరిగించి)- ఒక కప్పు, కొబ్బరి నూనె - ఒక టేబుల్ స్పూన్, క్యాండీ ఐస్​- కొన్ని, ఆరెంజ్ జెమ్స్​ - కొన్ని.  

తయారీ:  అరటి పండ్లను తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. కరిగించిన చాక్లెట్, కొబ్బరి నూనెని ఒక గిన్నెలో కలపాలి. అరటిపండు మొదలు, చివరి భాగాలను చాక్లెట్, కొబ్బరినూనె మిశ్రమంలో ముంచాలి. తర్వాత క్యాండీ ఐస్​ని అరటిపండు మొదటి భాగం దగ్గర పెంగ్విన్ కన్నులాగ పెట్టాలి. పాదాల కోసం అరటిపండు చివరి భాగంలో ఆరెంజ్​ జెమ్స్​ పెట్టాలి. ముక్కు కోసం ఆరెంజ్​ జెమ్​ని రెండుగా కట్​ చేయాలి. వీటిని అరగంట ఫ్రిజ్​లో పెడితే  యమ్మీ చాకో పెంగ్విన్స్​ రెడీ.