ఉత్తరప్రదేశ్ లో సినిమా స్టైల్లో దోపిడీ

ఉత్తరప్రదేశ్ లో సినిమా స్టైల్లో దోపిడీ

లక్నో : సినిమా తరహాలో దోపిడీ ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బులంద్‌షహర్‌లోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఇద్దరు దుండగులు షాపు యజమానిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడ ఉన్న వారిని కూడా తుపాకీతో బెదిరించి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లారు. డబ్బులు, నగలను బ్యాగులో వేసుకుని పారిపోయారు. 

వెళ్తు వెళ్తూ అక్కడే ఉన్న ఓ మహిళా కస్టమర్  బ్యాగ్ ను కూడా లాక్కుని దొంగలు పారిపోయారు. చోరీకి సంబంధించిన విజువల్స్ షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు విచారణ చేపట్టారు. పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం అన్ని చోట్ల తీవ్రంగా గాలిస్తున్నారు.