అమృత్ పాల్ సింగ్​ కేసులో కొత్త యాంగిల్

అమృత్ పాల్ సింగ్​ కేసులో కొత్త యాంగిల్
  •     ఇన్​స్టాలో  టైం పాస్ లవ్ చాటింగ్
  •     వాయిస్​ మెసేజ్​లు సేకరించిన పోలీసులు
  •     మాజీ ఆర్మీ ఉద్యోగులతో వెపన్ ట్రైనింగ్
  •     12 గంటల్లో 5 వెహికల్స్ మారిన అమృత్​పాల్​ సింగ్​

చండీగఢ్ : ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్​పాల్ కోసం పంజాబ్​ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. అమృత్​పాల్​కు చాలా మంది అమ్మాయిలు, మహిళలతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో మహిళలతో చేసిన చాట్​తో పాటు 12 వాయిస్ మెసేజ్‌‌‌‌లను పోలీసులు సేకరించారు. న్యూడ్​ వీడియోలు రికార్డు చేసి వారిని బ్లాక్​మెయిల్​ చేసేవాడని తేలింది. అమ్మాయిలతో కేవలం నార్మల్​ రిలేషన్‌‌‌‌షిప్ మాత్రమే కోరుకునేవాడు. సీరియస్​గా ప్రేమించేవాడు కాదు. ఈ విషయాన్ని అమృత్ పాలే వాయిస్ మెసేజెస్‌‌‌‌లో చెప్పాడు. మహిళలకు కోపం ఎప్పుడూ ముక్కు మీదే ఉంటుందనేవాడు. కొంత మంది మహిళలతో అఫైర్స్ కూడా కొనసాగించాడు. ఇన్​స్టాలో ఓ అమ్మాయితో తరుచూ మెసేజ్ చేసేవాడు. దుబాయ్‌‌‌‌లో హనీమూన్‌‌‌‌ చేసుకుందామని మెసేజ్​ పంపిస్తే.. ఆ అమ్మాయి నవ్వుతూ ఎమోజీ పెట్టింది.

ఐఎస్ఐ కనుసన్నల్లో.. 

డ్రగ్స్ బానిసలు, ఆర్మీ నుంచి తొలగించబడిన మాజీ సైనికోద్యోగులతో పాటు యువతను అమృత్​పాల్ టార్గెట్ చేసుకుని టెర్రరిస్ట్ గ్రూప్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేవాడని పంజాబ్ పోలీసులు తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత పాకిస్తాన్​కి చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆదేశాలతో అమృత్​సర్​లోని తన సొంతూరు జల్లుపూర్ కెహ్రాలో డ్రగ్ డి అడిక్షన్​ సెంటర్ ప్రారంభించాడు. చెడు ప్రవర్తన కారణంగా ఆర్మీ నుంచి తొలగించబడిన, రిటైర్డ్ సైనికుల కోసం సెర్చ్ చేసేవాడు. వీరితో యువతకు వెపన్ ట్రైనింగ్ ఇప్పించేవాడు. యాక్టర్​ దీప్ సిద్ధూ చనిపోయాక ‘వారిస్ పంజాబ్ దే’ బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు ఇద్దరిని సెక్యురిటీగా పెట్టుకున్నాడు. వీరి సంఖ్య ఈ ఏడాది ప్రారంభంలో 16కు పెంచుకున్నాడు. వీరిలో 8మంది యువకులే ఉన్నారు. వీరంతా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్​నుంచి వచ్చినవారే అని పోలీసులు తెలిపారు. సెంటర్​లో ఉన్నప్పుడే వారికి అమృత్​పాల్ ట్రైనింగ్ ఇచ్చాడు. 

డ్రగ్స్ డి అడిక్షన్​ సెంటర్​లో యూత్​ బ్రెయిన్ వాష్​

డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్​లో చేరిన వారికి అమృత్​పాల్ బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిస్ట్​ గ్రూపులో రిక్రూట్ చేసుకునేవాడు. ఎక్స్ సర్వీస్​మెన్స్​కు గన్ లైసెన్స్ ఉండటంతో వారితో యువతకు శిక్షణ ఇప్పించేవాడు. తల్వీందర్​ సింగ్, వారిందర్​సింగ్ అనే ఇద్దరు మాజీ సైనికోద్యోగులు డ్రగ్స్ బానిసలకు వెపన్ ట్రైనింగ్​లో కీలక పాత్ర పోషించారు. తల్వీందర్​ సింగ్ పరారీలో ఉండగానే అతని గన్​ లైసెన్స్​ను అధికారులు రద్దు చేశారు. వారిందర్ సింగ్​ పోలీసు కస్టడీలో ఉన్నాడు. డ్రగ్స్​ డి అడిక్షన్​ సెంటర్​ను ట్రైనింగ్​ కోసం, గురుద్వారాను ఆయుధాలను దాచిపెట్టేందుకు ఉపయోగించుకునేవాడు. కొందరు సూసైడ్ బాంబర్స్​ను కూడా అమృత్​పాల్ సిద్ధం చేశాడు. ఆనంద్​పూర్ ఖల్సా ఫౌజ్ (ఏకేఎఫ్) కోసం జల్లుపూర్ కెహ్రా గురుద్వారా, పలు డి అడిక్షన్ సెంటర్లలో దాచిపెట్టిన వెపన్స్, బాంబులు, యూనిఫాంలు, జాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పాయింట్ బ్లాక్​లో గన్ పెట్టి..

అమృత్​పాల్ సింగ్ 12 గంటల్లో ఐదు వెహికల్స్​మార్చాడు. ఆరు రోజులైన అతడి ఆచూకీ లభించలేదు. ఫస్ట్ బెంజ్ కారులో కనిపించిన సింగ్, తర్వాత షాకోట్​లో బ్రెజాకు మారాడు. తర్వాత నంగల్ అంబియాన్ వద్ద బజాజ్​ ప్లాటినా మోటార్​ సైకిల్​పై కనిపించాడు. బైక్​లో పెట్రోల్ అయిపోవడంతో దాన్ని దారాపూర్​లో డీజిల్​తో నడిచే త్రీ వీలర్​పై ఎక్కించాడు. తర్వాత అమృత్​పాల్, పాపల్​ ప్రీత్ కలిసి ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్​లో పెట్టి హీరో స్ల్పెండర్​ దొంగిలించారు. మార్చి 18న సాయంత్రం 6:46 గంటలకు లూథియానాలోని షేక్​పూర్​లో దొంగిలించిన బైక్​పై వెళ్తూ సీసీ టీవీ ఫుటేజీకి చిక్కారు. వెహికల్ ఓనర్ ఫిర్యాదు మేరకు పంజాబ్​ పోలీసులు స్ల్పెండర్​ను స్వాధీనం చేసుకున్నారు.

కురుక్షేత్రలో మహిళ షెల్టర్​

సోమవారం అమృత్​పాల్​ హర్యానా కురుక్షేత్రలోని ఓ ఇంటి నుంచి గొడుగు పట్టుకుని పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వైట్ షర్ట్, డార్క్​ బ్లూ జీన్స్ వేసుకుని వెళ్తున్నట్లు అందులో క్లియర్​గా కనిపిస్తున్నది. ఫేస్ కనిపించకుండా గొడుగు సాయం తీసుకున్నాడు. బల్జీత్ కౌర్ అనే మహిళ అమృత్​పాల్​తో పాటు పాపల్​ప్రీత్​కి షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను పోలీసులు అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు. అదేవిధంగా, అమృత్​పాల్ ప్రైవేట్ సెక్యురిటీలో ఉండే తజిందర్ సింగ్ గిల్​ను అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. లూథియానా జిల్లా ఖన్నా ఏరియాలోని మంగేవాల్ గ్రామానికి చెందిన గిల్,  సోషల్ మీడియాలో వెపన్స్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెట్టేవాడని ఖన్నా డీఎస్పీ హర్​సిమ్రత్​ సింగ్​ తెలిపారు.