టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ నూతన బోర్డును తొందరగా ఏర్పాటు చేయాలి

టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ నూతన బోర్డును  తొందరగా ఏర్పాటు చేయాలి
  • ఏఈఈలకు  అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి  
  • ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ఆశావహుల నిరసన 

ముషీరాబాద్, వెలుగు: టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించి వెంటనే నూతన బోర్డును నియమించాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరాపార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర్నా చౌక్​లో వారు నిరసన చేపట్టారు. ఏఈఈ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసి రిజల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చి అపాయింట్​మెంట్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులు ఈ నిరసనలో పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా ఏఈఈ ఆశావహులు మాట్లాడుతూ.. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ నిర్వహించిన వివిధ రకాల ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్ని ఒక్కొక్కటి ఒక్కో దశలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  జరిగిన పరీక్షల ఫలితాలను ప్రకటించకపోవడం దారుణమన్నారు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ నూతన బోర్డు నియామకంతో ముడిపడి ఉన్నాయని, గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నూతన బోర్డును నియమించి న్యాయం చేయాలని కోరారు. అలానే త్వరగతిన హరిజంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఏఈఈ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  ఏఈఈ ఆశావహులు సుమంత్ రెడ్డి, గుర్రం సబిత, ఆదిత్య, సాహితి, పృథ్వీ తదితరులు  పాల్గొన్నారు.