తెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాలి : దత్తాత్రేయ

తెలుగు రాష్ట్రాలలో నూతన విద్యా విధానం అమలు చేయాలి : దత్తాత్రేయ

వరంగల్ : పేదరిక నిర్మూలనలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుందని హరియాణా గవర్నర్​ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇందుకోసం విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం నూతన విద్య విధానం తీసుకువచ్చిందన్నారు.

2030 నాటికి అంతటా...

ఈ విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. 2030 నాటికి అంతటా ఈ విద్యా విధానాన్ని  అమలు చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హర్యానాలో 2025 నాటికి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.