Jai Hanuman : ‘జై హనుమాన్’ నుంచి స్పెషల్ అప్డేట్..రాముడికి ఆంజనేయుడు మాట

Jai Hanuman : ‘జై హనుమాన్’ నుంచి స్పెషల్ అప్డేట్..రాముడికి ఆంజనేయుడు మాట

హనుమాన్(HanuMan).. ఈ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న సినిమాగా కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varama) తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కథ, కథనం, విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ప్రేక్షకులు హనుమాన్ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది మూవీ

సూపర్ హీరో కాన్సెప్ట్ కి హిందూ మైథాలజీని లింక్ చేసి ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాను తీర్చిదిద్దిన విధానం, క్లైమాక్స్ లో హనుమాన్ ను క్రియేట్ చేసిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయిపోయారు.

సాక్షాత్తు హనుమంతుల వారిని చూసిన అనుభూతితో చాలా మంది చేతులెత్తి నమస్కారం చేశారు. అంతలా ఆడియన్స్ ను కట్టిపడేశాడు ప్రశాంత్.ఇక సినిమా చివర్లో హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ (Jai Hanuman) ఉంటుందని ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.

ఇటీవల సంక్రాంతి కానుకగా జై హనుమాన్ కథ పూర్తయిందని, త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయనే అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ ను ఖుషీ చేశాడు. ఇక తాజాగా నేడు ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్.

రాముడికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లుగా డిజైన్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. "ఒకప్పుడు త్రేతాయుగంలో ఒక భయంకరమైన వాగ్దానం చేయబడింది అది కలియుగంలో రక్షించబడుతుంది అని పోస్టర్ తో పాటు మేకర్స్ ఇలా రాసుకొచ్చారు.ఈ పోస్టర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.హనుమంతుల వారి సినిమాకు శ్రీరామ నవమి కన్నా ప్రత్యేకమైన రోజు ఇంకేం ఉంటుంది. పోస్టర్ భళే ఉంది డైరెక్టర్ గారు..పెద్ద హిట్ కొడుతావు అంటూ నెటిజన్స్ పోస్ట్ పెడుతున్నారు. 

జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హనుమంతు పాత్రలోనే కనిపిస్తారు కానీ, ఆంజనేయుడి పాత్రలో మాత్రం ఓ స్టార్‌ హీరో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి చిన్న హీరోతోనే ఈ రేంజ్ హిట్టు కొట్టిన ప్రశాంత్.. స్టార్ హీరోతో అది కూడా హనుమంతులవారి పాత్రతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.