క్రికెట్‌‌‌‌‌‌‌‌లో స్టాప్‌‌‌‌‌‌‌‌ క్లాక్.. మెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే, టీ20ల్లో డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ట్రయల్

క్రికెట్‌‌‌‌‌‌‌‌లో స్టాప్‌‌‌‌‌‌‌‌ క్లాక్..  మెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే, టీ20ల్లో డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ట్రయల్
  • ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య 60 సెకండ్లే గ్యాప్ ఉండేలా కొత్త రూల్
  •     మూడు సార్లు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు 5 రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ

అహ్మదాబాద్: మెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే, టీ20ల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త రూల్​ తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్లలో నిర్ణీత సమయంలో ఆటను పూర్తి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్‌‌‌‌‌‌‌‌ ఉండకూడదన్న రూల్‌‌‌‌‌‌‌‌ తెచ్చింది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్ ఒక ఓవర్ వేసిన తర్వాత నిమిషంలోపు తర్వాతి ఓవర్ స్టార్ట్​ చేయాల్సి ఉంటుంది. 

ఇందుకోసం స్టాప్‌‌‌‌‌‌‌‌ క్లాక్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తారు. ఒకవేళ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో మూడుసార్లు 60 సెకండ్ల రూల్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధించి వాటిని బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌  స్కోరులో జతచేస్తారని ఐసీసీ గవర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాడీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన తమ బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

ఈ నిబంధనను  డిసెంబర్ నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపింది.  ‘మెన్స్ వన్డే, టీ20ల్లో  ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ట్రయల్ ప్రాతిపదికన స్టాప్ క్లాక్‌‌‌‌‌‌‌‌ను ప్రవేశపెట్టడానికి క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) అంగీకరించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ నిబంధన ఉపయోగించబడుతుంది’ అని పేర్కొన్నది. 

పిచ్‌‌‌‌‌‌‌‌ బ్యాన్‌‌‌‌‌‌‌‌పై కొత్త నిబంధన

ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో పిచ్‌‌‌‌‌‌‌‌ను బ్యాన్‌‌ చేసే ప్రక్రియలో కూడా ఐసీసీ  మార్పులు చేసింది. అతిగా బ్యాటింగ్ లేదా బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలించే పిచ్‌‌‌‌‌‌‌‌లకు ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడంతో పాటు డీమెరిట్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను జరిమానాగా విధిస్తోంది. ప్రస్తుతం ఐదేండ్ల కాలంలో  ఐదు డీమెరిట్ పాయింట్లు ఎదుర్కొన్న  వేదిక అంతర్జాతీయ హోదాను రద్దు చేస్తోంది. ఇకపై ఆరు డీమెరిట్ పాయింట్లు ఎదుర్కొన్న  వేదిక కు అంతర్జాతీయ హోదాను తొలగించనుంది. ఈ మేరకు పిచ్, ఔట్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ మానిటరింగ్ నిబంధనల మార్పు,  పిచ్‌‌‌‌‌‌‌‌ను అంచనా వేసే ప్రమాణాల సరళీకరణకు ఆమోదం తెలిపినట్టు ఐసీసీ వెల్లడించింది. - 

అంపైర్లకు సమాన జీతం

క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మహిళా మ్యాచ్ అధికారుల అభివృద్ధిని వేగవంతం చేసే ప్రణాళికను ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) ఆమోదించింది.  ఇందులో మెన్, విమెన్స్ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఐసీసీ అంపైర్లకు సమాన జీతం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అలాగే, ప్రతి ఐసీసీ విమెన్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌  సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఒక తటస్థ అంపైర్ ఉండేలా చూసుకోవాలని, వచ్చే జనవరి నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లపై బ్యాన్ 


ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్ క్రికెటర్లు ఇంటర్నేషనల్ విమెన్స్​ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఆడకుండా ఐసీసీ  నిషేధం విధించింది.  మహిళల ఆట సమగ్రత, భద్రతను కాపాడటంతో పాటు వారికి రక్షణ కల్పించేందుకు తొమ్మిది నెలల పాటు వాటాదారులందరితో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీని ప్రకారం  ఏదైనా శస్త్ర చికిత్స గానీ లింగమార్పిడి చికిత్స చేయించుకొని పురుషుల నుంచి మహిళలుగా  మారిన వారికి విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు అర్హత లేదని స్పష్టం చేసింది. 

ఇంటర్నేషనల్ విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఆడేందుకు లింగ అర్హత నిబంధనలను కఠినతరం చేసిన ఐసీసీ  డొమెస్టిక్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను సభ్య దేశాలకు వదిలేసింది. ఈ నిబంధనలను రెండేండ్లలో సమీక్షిస్తామని తెలిపింది. 

లంక టీమ్ ఆడొచ్చు

ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌సీ)పై సస్పెన్షన్ విధించిన ఐసీసీ లంక క్రికెట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు కాస్త ఉపశమనం కలిగించింది. ఈ విషయంలో ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌సీ వాదనలు విన్న తర్వాత లంక జట్లు  ద్వైపాక్షిక క్రికెట్, ఐసీసీ ఈవెంట్లలో పోటీని కొనసాగించవచ్చని నిర్ణయించింది. అయితే సస్పెన్షన్ కొనసాగినంత కాలం లంక బోర్డుకు నిధులను ఐసీసీ నిలిపివేయనుంది.