ఏడాది బాలుడు .. బర్త్ డే కేక్ కోసం ఎగబడ్డడు

ఏడాది బాలుడు .. బర్త్ డే కేక్ కోసం ఎగబడ్డడు

ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ అనేది తీపి గుర్తుగా మిగులుతుంది. మొదటి జీతం, మొదటి వివాహ వార్షికోత్సవం, మొదటి పుట్టిన రోజు, స్కూల్ లో మొదటి రోజు... ఇలా చెప్పుకుంటూ పోతే ‘ఫస్ట్’ కు సంబంధించిన లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. ఆ  ప్రత్యేక రోజును చాలామంది జీవితాంతం గుర్తుండేలా తమకు నచ్చినట్లుగా జరుపుకుంటారు. ఓ ఏడాది బాలుడు కూడా ఫస్ట్ బర్త్ డేను తనకు నచ్చినట్లుగా ఫుల్ ఎంజాయ్ చేశాడు. తన పుట్టిన రోజున పేరెంట్స్ తెచ్చిన కేక్ తో పండగ చేసుకున్నాడు.

అందరిలా కేక్ కట్ చేస్తే స్పెషల్ ఏముందనుకున్నాడో.. లేక తన కేక్ ను తాను తప్ప ఇంకెవరూ తినొద్దనుకున్నాడో.. తెలియదు గానీ ఆ కేక్ ను రెండు చేతులతో పైకెత్తి అమాంతం నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖాన్ని కేక్ లో ముంచి మస్త్ ఎంజాయ్ చేశాడు. అందిన కాడికి తిన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూతికి, ముక్కుకి, నోటికి కేక్ అంటగా... ఆ బాలుడు ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.