పోస్టాఫీస్ ను కొత్త బిల్డింగ్లోకి మార్చాలి

పోస్టాఫీస్ ను కొత్త బిల్డింగ్లోకి మార్చాలి

గోదావరిఖని, వెలుగు: రామగుండం పట్టణంలో శిథిలమైన జెన్​కో క్వార్టర్స్​లో ఉన్న మెయిన్​ పోస్టాఫీస్​ను కొత్త బిల్డింగ్​లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్​అనుమాస శ్రీనివాస్​కోరారు. 

ఈ మేరకు ఆదివారం హైదరాబాద్​లో ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. చాలా ఏళ్ల క్రితం పోస్టాఫీస్​ను జెన్​కో క్వార్టర్స్​లో ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమైందని, పైకప్పు ఎప్పుడు కూలుతుందోనని ఉద్యోగులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. లీడర్లు తూండ్ల శ్రీనివాస్, మాచర్ల వినోద్, మడక జేమ్స్, దండుగుల రమేశ్

 ఉన్నారు.